Homeజాతీయ వార్తలుKarnataka Election 2023 : భజరంగ్ దళ్, కేరళ స్టోరీ.. బీజేపీకి ఓట్లు కురిపిస్తాయా?

Karnataka Election 2023 : భజరంగ్ దళ్, కేరళ స్టోరీ.. బీజేపీకి ఓట్లు కురిపిస్తాయా?

Karnataka Election 2023 : కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదం చేసిందా? లేకుంటే బీజేపీయే ఆ చాన్స్ తీసుకుందా? భజరంగదళ్ ను నిషేధిస్తామన్న మాట ఎవరికి మేలు చేసింది? అదేదో హనుమాన్ ఆలయాన్ని నిషేధిస్తామన్న రీతిలో బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఏమనాలి? అక్కడ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇంతకంటే ప్రచారం దొరకలేదా? లేకుంటే కర్నాటకలో ఎటువంటి అభివృద్ధి చేయలేదా? ప్రజల్లో మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టకుంటే గట్టెక్కలేమని భావిస్తున్నారా? ఇప్పడు దేశ రాజకీయాల్లో దీనిపైనే విస్తృత చర్చ జరుగుతోంది. బీజేపీ తీరుపైనే ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి.

ఆ మాటతో రాజకీయం..
భజరంగ్ దళ్ ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ మాటను బీజేపీ అడ్వాంటేజ్ గా తీసుకుంది. గత ఐదేళ్లుగా కర్నాటకను పాలించింది తానేనన్న విషయం మరిచిపోయింది. ఈ ఐదేళ్ల పాలనలో తాను ఏం చేసింది చెప్పుకునే బదులు.. కాంగ్రెస్ నోరుజారిన మాటనే హైలెట్ చేస్తోంది. హనుమాన్ చాలీసా చదువుతోంది. భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ చెప్పిందని.. బీజేపీ ఈ రచ్చ చేస్తోంది. అదేదో హనుమాన్ ఆలయాల్ని నిషేధిస్తున్నట్లుగా హిందువులను రెచ్చగొట్టడానికి గొప్ప టూల్ లాగా వాడేసుకుంటున్నాయి. మీడియా, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇది కర్ణాటక ప్రజల్ని తక్కువ అంచనా వేయడమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఎప్పుడు సిల్లీ రీజన్సేనా?
అశేష భారతావనిని ఏలుతున్న బీజేపీకి సిల్లీ రీజన్స్ తప్ప..చేసిన మంచి పనులు గుర్తులేవా? చేయలేదా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం మ్యాజిక్ చేసి దేశ పాలనను కైవసం చేసుకున్నట్టుందని ఎద్దేవా చేస్తున్నారు. ఎన్నాళ్లీ మత రాజకీయాలని ప్రశ్నిస్తున్నారు. మతం పేరిట కథలు చెప్పుకుని .. సెంటిమెంట్ పండించి ఓట్లు దండుకునే సంస్కృతి విడానాడాలని సూచిస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రచార సరళి చూస్తే.. ఇదే అర్థం అయిపోతుంది. యడ్యూరప్ప ప్రభుత్వం కానీ.. బొమ్మై ప్రభుత్వం కానీ..తాము కర్ణాటకకు ఫలానా పనిచేశామని ఎన్నికల్లో చెప్పుకోలేదు. మొదటి నుంచి విపక్షాల వైఫల్యాలనే నమ్ముకున్నారు.

మసకబారుతున్న ప్రభ
ప్రపంచంలో శక్తివంతమైన నేతగా ప్రధాని మోదీకి పేరుంది. అందుకు తగ్గట్టుగానే ఆయన శక్తివంతమైన ప్రసంగాలు చేస్తారు. కానీ ఎన్నికల ప్రచార వేదికల్లో మాత్రం భిన్నంగా మాట్లాడతారు. బేలతనం చూపిస్తారు. ఫక్తు రాజకీయ నాయకుడిలా దర్శనమిస్తారు. తొలుత ప్రధాని మోదీ తనను కాంగ్రెస్ నేతలు తిడుతున్నారని ప్రచారం చేసుకున్నారు. అయినా ప్రజల కోసం పడుతున్నానని.. తనను తిట్టినా పర్వాలేదని.. కానీ కులాల్ని తిడుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని మొదట ప్రసంగాలు ….” చీప్.. వెరీ చీప్ ” అన్న ఫీడ్ బ్యాక్ తీసుకొచ్చాయి. అయితే ఇలాంటివే ఓట్లు తెచ్చి పెడతాయని వారు గట్టిగా నమ్ముతారు. అందుకే మరింత లోకి వెళ్లిపోయారు. చివరికి కేరళ స్టోరీ గురించి కూడా కథలు చెప్పారు. అది ఓ సినిమా. దాన్ని కాంగ్రెస్ కు ముడి పెట్టేసి.. ప్రధాని కూడా విమర్శలు గుప్పించారు. అయితే ఈ క్రమంలో ఉవ్వెత్తున ఎగసిన బీజేపీ ప్రభ, మోదీ ఆకర్షణ మసకబారుతోందన్న విమర్శలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular