https://oktelugu.com/

KA Paul- BJP- KCR: తెలంగాణలో కేసీఆర్ పైకి బీజేపీ విసురుతున్న అస్త్రం కేఏ పాల్.?

KA Paul- BJP- KCR: ఏమో.. గుర్రం ఎగురావచ్చు.. రాజకీయాలన్నవి ఎప్పుడైనా మారనూ వచ్చూ.. తెలుగు రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ అర్థం కావు.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ను ఓడించడానికి వైసీపీ పార్టీ రంగు, ఆ పార్టీ సింబల్ ను పోలిన గుర్తును తీసుకొని కేఏ పాల్ పోటీచేశారు. దీనివెనుక చంద్రబాబు , టీడీపీ హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. జగన్ ను ఓడించడానికి అమెరికా నుంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : June 1, 2022 / 06:12 PM IST
    Follow us on

    KA Paul- BJP- KCR: ఏమో.. గుర్రం ఎగురావచ్చు.. రాజకీయాలన్నవి ఎప్పుడైనా మారనూ వచ్చూ.. తెలుగు రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ అర్థం కావు.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ను ఓడించడానికి వైసీపీ పార్టీ రంగు, ఆ పార్టీ సింబల్ ను పోలిన గుర్తును తీసుకొని కేఏ పాల్ పోటీచేశారు. దీనివెనుక చంద్రబాబు , టీడీపీ హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. జగన్ ను ఓడించడానికి అమెరికా నుంచి కేఏ పాల్ ను దించి పావుగా వాడారని నాడే గుసగుసలు వినిపించాయి. కానీ ఈ ప్రయోగం విఫలమైంది. పాల్ ఓడిపోయి అమెరికాకు తిరిగి వెళ్లిపోయారు.

    KA Paul- MODI

    కేఏ పాల్ ఎప్పుడూ రాజకీయాల్లో ఒక పావుగా ఉంటాడని అర్థమైపోతోంది. ఆయన రాజకీయం కూడా ఎవరినో దెబ్బతీయడానికే కానీ.. గెలుపు కోసం కాదన్నది వాస్తవం. ఇప్పుడు కేఏ పాల్ సడెన్ గా వచ్చి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఆయనను తెలంగాణ రాజకీయాల్లోకి ప్రయోగించి కేసీఆర్ ను చావుదెబ్బ తీసే ప్లాన్ ను బీజేపీ చేస్తోందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో అమిత్ షాను కలిశాక కేఏ పాల్ తెలంగాణలో ఎందుకు యాక్టివ్ అయ్యారు? తాజాగా కేసీఆర్ పై ఒంటికాలిపై లేస్తూ ‘తెలంగాణ అమరులకు న్యాయం’ పేరుతో ఎజెండా ఎందుకు ఎత్తుకున్నారు? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనివెనుక బీజేపీ ఉందని.. కేఏ పాల్ ను ముందు పెట్టి కేసీఆర్ పైకి అస్త్రంగా బీజేపీ వదలబోతోందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

    Also Read: KA Paul- KCR: కేసీఆర్ ఆయువుపట్టుపై కొడుతున్న కేఏ పాల్..

    కేసీఆర్ పై కేఏ పాల్ కోపానికి బలమైన కారణమే ఉంది. కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో పర్యటించి అక్కడి సమస్యలను ఎత్తి చూపాలని కేఏ పాల్ బయలుదేరితే టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు. ఓ కార్యకర్త కే ఏ పాల్ చెంప పగులకొట్టాడు. దీంతో అప్పుడే కేసీఆర్ అంతు చూస్తానని పాల్ శపథం చేశారు. అన్నట్టుగానే తన ఇగో హర్ట్ కావడంతో ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారు. ఇక్కడే రాజకీయం మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ ఆడే చందరంగంలో ‘పాల్’ పావుగా మారినట్టున్నాడన్న ప్రచారం సాగుతోంది.

    తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భావిస్తున్న బీజేపీ కేసీఆర్ ను ఓడించేందుకు కలిసి వచ్చే అన్ని శక్తులను వాడుకోవాలని చూస్తోంది. ఎలాగైనా సరే కేసీఆర్ ను ఓడించి ఆయన జాతీయ రాజకీయాల్లోకి రాకుండా.. మోడీకి ప్రత్యామ్మాయ నేతగా ఎదగకుండా చేయాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా హైదరాబాద్ లోనే నిర్వహిస్తోంది.

    KA Paul- MODI

    తెలంగాణలో అధికారం కోసం కేఏ పాల్ లాంటి నోరున్న పవర్ ఫుల్ శక్తుల అవసరం ఉంది. అందుకే అమిత్ షాను కలవగానే కేఏ పాల్ ట్రాక్ చేంజ్ చేశాడు. తెలంగాణలో కేసీఆర్ పట్టించుకోని ‘తెలంగాణ అమరులు-ఉద్యమకారులకు’ న్యాయం చేయడమే తన లక్ష్యం అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. దీనివెనుక బీజేపీ ఉందన్న గుసగుసలు తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తమవుతున్నాయి.

    ఏపీలో కేఏ పాల్ ను పెట్టి జగన్ ను ఓడించాలనుకున్న ఎత్తులు పారలేదు. మరి తెలంగాణలోనైనా కేసీఆర్ ఓడించడం సాధ్యమా? అంటే ఏమో చెప్పలేం. ఇప్పటికే పీకల్లోతు వ్యతిరేకత కేసీఆర్ పై వస్తోంది. దానికి తోడు తెలంగాణ ఆర్థిక స్థితిగతులు దారుణంగా ఉన్నాయి. ఇలాంటి టైంలో బలం లేని కేఏ పాల్ కూడా బలంగా మారే అవకాశాలుంటాయి. ఎవరినీ పూచికపుల్లలా తీసేయడానికి లేదు. కేఏ పాల్ చేసే డ్యామేజ్ అంతా ఇంతా కాదు.. చిన్న పామునైనా పెద్దకర్రతోనే కొట్టాలి. మరి కేసీఆర్ ఈ బీజేపీ ఎత్తులకు ఎలాంటి పై ఎత్తులు వేస్తాడన్నది వేచిచూడాలి.

    Also Read:YCP Bus Yatra Failure: అన్నీ చేస్తున్నా ప్రజాదరణ కరువు.. వైసీపీ నేతల్లో అంతర్మథనం

    Recommended Videos:


    Tags