BJP Politics: ఏపీలో అస్సలు బలం లేని బీజేపీకి ఇప్పుడు చంద్రబాబు, జగన్ లు అడ్డంగా దొరికారని కమలం పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. తమిళనాడులో బలం లేకున్నా అన్నాడీఎంకే పార్టీని లొంగదీసుకొని బీజేపీ ఎలా అల్లాడించిందో మనం చూశాం. ఇప్పుడు అచ్చం అలాగే మరోసారి ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు బీజేపీ సిద్ధమవుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు పెగాసస్ సాఫ్ట్ వేర్ కొన్నాడని.. ప్రతిపక్షాలు, ప్రత్యర్థుల ఫోన్ కాల్స్ విని రాజకీయంగా లబ్ధి పొందాడని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై చంద్రబాబు, టీడీపీ వర్గాలు నోరుమెదపకపోవడంతో ఈ ఆరోపణలు నిజమేనని.. చంద్రబాబు బుక్కయ్యాడన్న ప్రచారం సాగుతోంది.
Also Read: Congress: కాంగ్రెస్ కథ: బలోపేతం మాటున బలహీనపర్చే ప్రయత్నం..
కేంద్రంలోని బీజేపీకి ఇప్పుడు ఏపీ రాజకీయాలను ఓ ఆట ఆడుకునే అవకాశాన్ని సీఎం జగన్, చంద్రబాబులే కల్పించారన్న ప్రచారం సాగుతోంది. చంద్రబాబు మెడకు చుట్టుకున్న ‘పెగాసస్’ వివాదంతో ఆయన రాజకీయ భవిష్యత్తును క్లోజ్ చేసే ఆలోచనలో బీజేపీ ఉందన్న టాక్ నడుస్తోంది. ఇక ఇప్పటికే అక్రమాస్తుల కేసుల్లో చిక్కి జగన్ కేంద్రంలోని బీజేపీ చేతిలో కీలుబొమ్మగా ఉన్నారన్న ప్రచారం ఎలాగూ ఉంది. ఇప్పుడు అందివచ్చిన పెగాసస్ వివాదంతో చంద్రబాబు చాప్టర్ ను క్లోజ్ చేసి ఇద్దరినీ ఏపీ రాజకీయాల నుంచి సాగనంపి ఆంధ్రా రాజకీయాలను ఏలాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉందని ఈ మేరకు ప్లాన్లు రెడీ చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది.
అధికార వైసీపీ ఇప్పుడు వచ్చే రెండేళ్లలో జరిగే ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. టీడీపీ మాత్రం చడీచప్పుడు లేకుండా స్తబ్దుగా ఉంది. అయితే అందరికంటే యాక్టివ్ గా బీజేపీ ఇప్పుడు ఐదు రాష్ట్రాల విజయంతో మిగతా రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. ఏపీలోని ప్రధాన ప్రాంతీయ పార్టీలైన జగన్, చంద్రబాబులపై బీజేపీ ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా రాయలసీమ కేంద్రంగా బీజేపీ రాజకీయ వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంతోపాటు రాజకీయాల్లో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై తీవ్రంగా శోధిస్తున్నారట..
ఈ క్రమంలోనే కేసుల ఊబిలో ఉన్న జగన్ ను.. అలాగే పెగాసస్ తో తీవ్రంగా కూరుకుపోయిన చంద్రబాబును క్లోజ్ చేస్తే ఏపీ రాజకీయాలను జనసేనతో కలిసి ఏలవచ్చని బీజేపీ ప్లాన్ చేస్తోందట.. వచ్చే ఎన్నికల ముందు ఈ ప్లాన్ వర్కవుట్ చేసేందుకు బీజేపీ రెడీ అవుతున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే ఏపీలో బీజేపీకి అధికారం.. పవన్ కళ్యాణ్ కు సీఎం కుర్చీ దక్కడం ఖాయమంటున్నారు. మరి ఏం జరుగుతుందనేది భవిష్యత్తు తేల్చనుంది.
Recommended Video: