KCR Vs BJP: కేసీఆర్‌ రాజకీయ చాణక్యం ముందు బీజేపీ బోసిపోయింది!

KCR Vs BJP: తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. దీని ఆధారంగా అధికార బీఆర్‌ఎస్‌ను విపక్షాలు అన్నివిధాలుగా టార్గెట్‌ చేశాయయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రదర్శించిన చాణక్యం.. టీఎస్‌ఎస్సీ పేపర్ల లీకేజీ అంశాన్ని ప్రజలు మర్చిపోయేలా చేసింది. పదో తతరగతి ప్రశ్నపత్రాల లీకేజీతో, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంపై చర్చ జనాలలో కాస్త తగ్గింది. టీఎస్‌పీఎస్పీ ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో ఒకవైపు రచ్చ జరుగుతుండగానే […]

Written By: Raj Shekar, Updated On : April 8, 2023 10:36 am
Follow us on

KCR Vs modi

KCR Vs BJP: తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. దీని ఆధారంగా అధికార బీఆర్‌ఎస్‌ను విపక్షాలు అన్నివిధాలుగా టార్గెట్‌ చేశాయయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రదర్శించిన చాణక్యం.. టీఎస్‌ఎస్సీ పేపర్ల లీకేజీ అంశాన్ని ప్రజలు మర్చిపోయేలా చేసింది. పదో తతరగతి ప్రశ్నపత్రాల లీకేజీతో, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంపై చర్చ జనాలలో కాస్త తగ్గింది. టీఎస్‌పీఎస్పీ ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో ఒకవైపు రచ్చ జరుగుతుండగానే మరోవైపు పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకైంది. దీంతో విపక్షాలకు మరో ఆయుధం దొరికింది. దీంతో అధికాపార్టీని మరింత ఇబ్బంది పెట్టాలని భావించిన ప్రతిపక్ష పార్టీలకు, ముఖ్యంగా బీజేపీకి కేసీఆర్‌ చెక్‌ పెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్‌ సూత్రధారి అంటూ అరెస్ట్‌ చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టి బీజేపీవైపు మళ్లింది.

లీకేజీని అనుకూలంగా మార్చుకున్న బీఆర్‌ఎస్‌..
లీకేజీ అంశంలో కొన్ని రోజులుగా ఇరుకున పడ్డ బీఆర్‌ఎస్‌ సర్కార్, కల్వకుంట్ల కుటుంబం అదే లీకేజీ అంశంతో బీజేపీని దెబ్బ కొట్టింది. వరంగల్‌ జిల్లాలో జరిగిన పదవ తరగతి హింది ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పట్టుబడిన మాజీ విలేకరి బూరం ప్రశాంత్, బండి సంజయ్‌కు ప్రశ్నాపత్రాన్ని పంపించడం, అంతకు ముందు రోజు వారిద్దరూ వాట్సాప్‌ కాల్‌ మాట్లాడడం వంటి పరిణామాలు బీఆర్‌ఎస్‌ పార్టీకి సరిగ్గా పనికొచ్చాయి. దీంతో బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేసి, అనేక నాటకీయ పరిణామాలు, ఉద్రిక్త పరిస్థితుల మధ్య బండి సంజయ్‌ అరెస్టుకు హైప్‌ క్రియేట్‌ చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు పంపించారు. దీంతో లీకేజీ విషయం మొత్తం బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారిపోయింది.

KCR Vs BJP

విపక్షాలకు చెక్‌ పెట్టేలా..
ఇక దీంతో తెలంగాణ రాష్ట్రంలో జనాల ఫోకస్‌ టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ నుంచి బండి సంజయ్‌ అరెస్ట్, ఆయనను జైలుకు తరలింపు, ఆ తర్వాత బీజేపీ ఏం చేస్తుంది అన్న అంశంపై పడింది. మొత్తానికి టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని డైవర్ట్‌ చేసి, ప్రభుత్వ అసమర్థతను టార్గెట్‌ చేస్తున్న ప్రతిపక్షాలకు చెక్‌ పెట్టేలా బీఆర్‌ఎస్‌ వ్యూహం సాగింది. అలాగే పదేపదే కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులతో తెలంగాణ మంత్రులను, నేతలను టార్గెట్‌ చేస్తున్న బీజేపీకి కూడా ఒక ఝలక్‌ ఇచ్చేలా, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపించడం కూడా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

మొత్తంగా టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాల దాడి మరింత పెరగకుండా, పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలో బీజేపీ ఉందన్న విషయాన్ని ప్రజా క్షేత్రంలో హైలెట్‌ చేసి బీఆర్‌ఎస్‌ మంత్రులు దాడి చేయడం, సెల్ఫ్‌ డిఫెన్స్‌లో పడిన బీజేపీ తమను తాను రక్షించుకునే ప్రయత్నం చేయడం ప్రధానంగా కనిపించింది. ఏదేమైనా రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారిన, మంత్రి కేటీఆర్‌ను టార్గెట్‌ చేసిన టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీకి పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో రీప్లేస్‌ చేయడంలో బీఆర్‌ఎస్‌ సక్సెస్‌ అయింది.