Telangana Movement : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు బీజేపీ దారి చూపించిందా..? అసలు తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టిందెవరు..? కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకోవాలనుకున్నారు..? టీపీపీఎస్సీ మాజీ అధ్యక్షుడు విఠల్, బీజేపీ నేత వీటికి సంచలన సమాచాధానాలు చెప్పారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు తెలంగాణ ప్రజలు ఏవిధంగా వివక్షను ఎదుర్కొన్నారో విఠల్ చెప్పారు. ఈ సందర్భంగా ‘ఓకె తెలుగు’ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం..

‘అది 1994 ప్రాంతం.. చంద్రబాబు హయాంలో తెలంగాణ ప్రజలు అణచివేతకు గురవుతున్న సమయం. కనీసం న్యూస్ పేపర్లలో కూడా తెలంగాణ పదం వచ్చేది కాదు.. అంతేకాదు తెలంగాణ పదం వాడితే చిన్నచూపు చూసేవారు. అసెంబ్లీలో గానీ, బయట ప్రజలు గానీ ఎవరూ తెలంగాణను వాడద్దన్నట్లుగా నిలువరించేవారు.. ఈ క్రమంలో కొందరు తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి.. మరోవైపు తెలంగాణ నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధికి ఎందుకు దూరమవుతున్నారు..? అనే విషయాలను బేరీజు చేసుకొని తెలంగాణపై జరిగిన వివక్షపై సదస్సులు నిర్వహించేవాళ్లం.. ’ అని విఠల్ అన్నారు.
‘1996 సంవత్సరంలో కాకినాడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేసింది. ఈ సమయంలో బీజేపీ నాయకులు ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’ అని తీర్మానించారు. దీంతో తెలంగాణకు ప్రత్యేకంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ పుట్టుకొచ్చింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న వాజ్ పేయి ప్రభుత్వం చిన్నరాష్ట్రాలకు అనుకూలంగా ఉంది. ఈ సమయంలో ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, జార్ఘండ్ రాష్ట్రాలు ఎలాంటి డిమాండ్ లేకుండానే ఏర్పడ్డాయి. అయితే ఆ రోజుల్లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ పేరు కూడా చేర్చితే ఆటోమేటిక్ గా తెలంగాణ అప్పుడే వచ్చేది.’ అని విఠల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘కానీ తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్నది చంద్రబాబునాయుడు. ఈ విషయం మెల్లగా బయటపడింది. మరోవైపు తెలంగాణలో వ్యవసాయం దండగ అంటూ గ్లోబలైజేష్ కు చంద్రబాబునాయుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఉద్యోగాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకునేవాడు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచే చంద్రబాబుపై వ్యతిరేకత పెరిగింది. మరోవైపు మావోయిస్టు వ్యతిరేక విధానాలను చంద్రబాబు అమలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ ను నేనే డెవలప్ చేశానని గొప్పలు చెప్పుకునేవారు.ఇక చంద్రబాబు తన సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ముందే తన వర్గానికి లీక్ చేసి అక్కడ భూములు కొనిపించేవారు. అలా భూములు కొన్న ఆంధ్రాప్రాంతానికి చెందిన వారు కోటీశ్వరులయ్యారు.తెలంగాణ భూములను దోచుకుంటున్నారు.. తెలంగాణ నీళ్లను దోచుకుంటున్నారు.. తెలంగాణ ఉద్యోగులను దోచుకుంటున్నారు.. అనే ఆందోళన ఇక్కడి ప్రజల్లో మొదలైంది. ’ అని విఠల్ అన్నారు.
Also Read: త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ.. మంత్రి రేసులో ఆ ముగ్గురు?
‘ఇక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తే.. ఇంటర్వ్యూల్లో వివక్ష చూపించేవారు.. ఇక నీళ్ల విషయంలో ప్రాంతీయ అసమానతలను ఏర్పరిచేవారు. ఈ సమయంలో 2000 సంవత్సరంలో కేసీఆర్ పార్టీ కోసం సమాలోచనలు చేస్తున్నారు. అప్పటిమే వివక్ష ఎదుర్కొంటున్న మేము సంఘాలుగా ఏర్పడి సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. ఈ క్రమంలో రాజకీయంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అప్పటికే టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కలేదని కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో కేసీఆర్ తో పలుసార్లు సమావేశం నిర్వహించారు. అయితే మొత్తంగా తెలంగాణకు ‘నీళ్లు, నిధులు, నియామకాల్లో’ అన్యాయం జరుగుతుందని, ఈ విషయం మీదనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పరుచుకోవాలని అంచనాకు వచ్చాం… అలా తెలంగాణ ఉద్యమానికి బీజేపీ రూటు చూపించింది’ అని విఠల్ తెలంగాణ ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: లంగాణ ఉద్యమంలో తెరవెనుక ఏం జరిగింది.. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేత విఠల్’ చెప్పిన సంచలన నిజాలు