BJP: బద్వేల్ బరిలో బీజేపీ నిలబడుతోంది. అభివృద్ధే తమ ఎజెండా అని బీజేపీ రాష్ర్ట అద్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఎవరికి భయపడేది లేదని ఎన్నికల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. ఏపీని అభివృద్ధి చేసేది కేంద్ర ప్రభుత్వమే అని చెబుతున్నారు. ప్రధానమంత్రి సంక్షేమ పథకాలతో దేశం ముందుకు పోతోందని తెలిపారు. బద్వేల్ లో కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని అందుకే పోటీలో ఉన్నామని స్పష్టం చేశారు.

ప్రపంచ దేశాలతో పోటీ పడి దూసుకుపోతున్న భారత దేశ అభివృద్ధి విషయంలో స్టేట్లు తక్కువ చేసి చూపిస్తున్నాయని దుయ్యబట్టారు. పథకాలు కేంద్రానివి పేర్లు మాత్రం వారివా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పనిలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని చెప్పారు. దీన్ని నిరూపిస్తామని సవాలు విసిరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ర్ట ప్రభుత్వ పథకాలుగా స్టిక్కర్లు వేసుకుని పాలన సాగించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్లు అప్పుగా తెచ్చుకుంటుుంది ఏపీ ప్రభుత్వం. అన్ని దారుల్లో లక్షల కోట్లు ఆస్తులను తాకట్టు పెడుతూ తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్నే విమర్శించడం వెనుక ప్రభుత్వ ఉద్దేశమేమిటో అర్థం కావడం లేదు. రాష్ర్ట అభివృద్ధిపై వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాలు విసిరారు. మూడు రాజధానుల వ్యవహారం ఏమైందని ప్రశ్నించారు. అమరావతితో రూ.1800 కోట్లతో ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మించింది బీజేపీయేనని చెప్పారు.
రాష్ర్ట అభివృద్ధిలో తమ భాగస్వామ్యం ఉందని సూచిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం వ్యతిరేక విధానాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. జనసేన పోటీ నుంచి తప్పుకున్నా మిత్రపక్షంగా ఉన్న బీజేపీ మాత్రం పోటీలో ఉండడం చర్చనీయాంశంగా మారుతోంది. మొత్తానికి రాజకీయం ఎటు వైపు వెళ్తుందో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.