CM Jagan: సివిల్ సర్వీస్ కేడర్ నిబంధనలు కేంద్రం ఇటీవలే మార్చింది. దీనిని బీజేపీ కాకుండా మిగతా పార్టీ సీఎంలు అందరూ వ్యతిరేకించారు. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు. ఇందుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. లేఖ అందిన కొద్దిసేపటికే ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ గా గుడ్ న్యూ్స్ చెప్పింది. అదనపు రుణాల సేకరణ కోసం కేంద్ర ఆర్థిక శాఖ ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

విద్యు్త్ సంస్కరణలలో భాగంగా రాజస్థాన్‌తో పాటు ఏపీకి సైతం అదనపు రుణాల సేకరణ కోసం పర్మిషన్ ఇచ్చింది. సంస్కరణల్లో భాగంగా రూ.7309 కోట్లకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. ఇందులో రాజస్థాన్ కు రూ.5816, ఏపీకి రూ.2123 కోట్లు సేకరించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇందుకు మొత్తంగా 11 రాష్ట్రాలు దరఖాస్తు చేసుకోగా అందులో కేవలం రెండింటికి మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది.
Also Read: YS Jagan New Districts: జగన్ కొత్త జిల్లాల ఏర్పాటు వెనక ఆంతర్యం అదేనట.. ఫైర్ అవుతున్న చంద్రబాబు..
విద్యుత్ సంస్కరణల అమలు అంటే పొలాల్లో రైతుల విద్యుత్ మీటర్లు పెట్టినందుకు ఈ లోన్ తీసుకోవచ్చు. ఇంకా ఆర్బీఐ నుంచి బాండ్లు వేలం వేసి తీసుకునే లోన్ కు మాత్రం కేంద్రం అనుమతి ఇవ్వలేదు. పరిమితికంటే ఎక్కువగా ఏపీ రుణం తీసుకున్నదనే ఉద్దేశంతోనే అందుకు కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదు. కానీ నిధుల్లో ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగానే పన్నుల వాటా ఇవ్వడంతో పాటు ఇతర రూపాల్లోనూ కేంద్రం సాయం చేస్తుంది.
ఇదిలా ఉండగా తెలంగాణపై కేంద్రం కాస్త గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. సివిల్ సర్వీస్ కేడర్ నిబంధనలకు సైతం వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ స్పందించారు. ఇదే కాకుండా వడ్ల కోనుగోలు, తదితర విషయాల్లో కేంద్రం తీరుతో అసహనానికి లోనైన సీఎం.. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని సైతం వెల్లడించారు. మరి వచ్చే ఎన్నికల్లో బీజేపీ కలిసి టీఆర్ఎస్ పని చేసే అవకాశాలు కనిపించడం లేదు. మరి వచ్చే ఎన్నికల టైంలో ఏ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Also Read: New Tension To CM Jagan: జగన్‌కు కొత్త టెన్షన్.. జిల్లాల ఏర్పాటుతో వైసీపీలో ఇలా జరుగుతుందేంటి..
[…] […]