Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan- BJP: చంద్రబాబు కంటే జగనే సేఫ్.. పవన్ ను ఒప్పించే పనిలో...

Pawan Kalyan- BJP: చంద్రబాబు కంటే జగనే సేఫ్.. పవన్ ను ఒప్పించే పనిలో బీజేపీ అగ్ర నాయకత్వం

Pawan Kalyan- BJP: ఏపీ సీఎం జగన్ కు బీజేపీ కేంద్ర నాయకత్వం ఆశీస్సులు బలంగా ఉన్నాయి. 2024 తర్వాత కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. తెలంగాణాలో దూకుడుగా ఉన్న బీజేపీలో ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.. ఆంధ్రప్రదేశ్‌లో సొంతంగా లేదా జనసేనతో కలసి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి పరోక్షంగా అండదండలు అందించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోని పక్షంలో జగన్మోహన్‌ రెడ్డిని ఇంటికి పంపలేమని బీజేపీ అగ్రనాయకులకు నచ్చజెప్పడానికి పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. జగన్‌ పోయి చంద్రబాబు అధికారంలోకి వస్తే మనకు ఏమిటి లాభం? అని ఢిల్లీ స్థాయి నాయకులు పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారని తెలిసింది. చంద్రబాబుకు వయసు మీద పడుతోంది.. 2029 ఎన్నికల నాటికి ఆయన పనైపోతుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన లేదా బీజేపీలో విలీనమవుతుంది. అప్పుడు మీరే ముఖ్యమంత్రి కావొచ్చు. అంతవరకు ఓపిక పట్టండి అని జనసేనానికి బీజేపీ నాయకత్వం హితబోధ చేసినట్టు చెబుతున్నారు. అయితే దీనిపై పవన్ డిఫెన్స్ లో పడిపోయారు. అందుకే తన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని ప్రకటించారు.

Pawan Kalyan- BJP
Pawan Kalyan- Modi

స్పష్టమైన వైఖరితో…
ఏపీ విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ముందుకెళుతున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో కలిసి ట్రావెల్ చేసేందుకు కేంద్ర పెద్దలు ఇష్టపడడం లేదు. తమకు నమ్మకమైన స్నేహితుడు కావాలని, అవసరాల కోసం వదులుకునే చంద్రబాబు లాంటి వ్యక్తి కాదని పవన్ కల్యాణ్ కు తెగేసి చెప్పేటట్లే కనపడుతుంది. పవన్ కల్యాణ్ కు బీజేపీ ఒక రూట్ మ్యాప్ ఇవ్వాలనుకుంటుంది. అది కేవలం జనసేన, బీజేపీ లు మాత్రమే పోటీ చేసేందుకు సిద్ధమవ్వాలని… ఆయనకు త్వరలోనే తెలియజేయనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయం ఎన్నికల అనంతరం చర్చిద్దామని, ఏ రాష్ట్రంలోనూ తాము సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించబోమని పవన్ కల్యాణ్ కు బీజేపీ తెలియజేయనున్నట్లు తెలిసింది.

Also Read: PK Survey Report On Telangana: పీకే సర్వేతో కేసీఆర్ లో గుబులు మొదలైందా?

అయితే పవన్ కల్యాణ్ కు కొన్ని హామీలు ఇచ్చేందుకు మాత్రం కేంద్ర నాయకత్వం సిద్ధమయిందని తెలిసింది.2029 నాటికి ఏపీ రాజకీయ పరిస్థితులు మారతాయని, దానిని అంచనా వేసుకుని ఆలోచించుకోవాలని కూడా బీజేపీ నాయకత్వం పవన్ కు చెప్పనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదన్నది వారి వాదన. ఇప్పటికే చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబును నమ్మడం వేస్ట్ అని పవన్ కు కేంద్ర నాయకత్వం హితబోధ చేసే అవకాశమూ లేకపోలేదు. 2024 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అన్ని రకాలుగా పార్టీకి అండదండలుంటాయని బీజేపీ పెద్దలు పవన్ కు హామీ ఇవ్వనున్నారని సమాచారం. ఆర్థికంగానే కాకుండా కేంద్రంలో కూడా అవసరమైతే అవకాశం కల్పిస్తామని కూడా పవన్ కు స్పష్టమైన హామీ ఇస్తారని చెబుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోయన్న సందేహం నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జగన్ నే బీజేపీ పెద్దలు నమ్ముకుంటారన్నది హస్తిన నుంచి వినపడుతున్న టాక్.

చంద్రబాబు అన్నీ ప్రయత్నాలు…
అయితే బీజేపీతో స్నేహం చేసేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారు. తనకు అంది వచ్చిన ఏ అవకాశాన్ని జార విడుడుచుకోవడం లేదు. సంఖ్యాబలంగా లోక్ సభలో తక్కువ బలమున్నా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కీలక విషయాల్లో ఎన్డీఏ తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు తెలుపుతున్నారు. గత ఎన్నికల్లో బీజపేపీని దూరం చేసుకున్నందున భారీ మూల్యం చెల్లించుకున్నందున.. ఎలాగైన బీజేపీని మచ్చిక చేసుకోవాలన్న యత్నంలో ఉన్నారు. కానీ చంద్రబాబు నైజాన్ని గుర్తెరిగిన కేంద్ర పెద్దలు దరి చేరనీయడం లేదు. అయితే చంద్రబాబు సైతం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తునే ఉన్నారు. తన పాత స్నేహాన్ని వినియోగించుకొని బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి లోక్ సభ సీట్లు అవసరం కాబట్టి.. వీలైనన్నీ ఎక్కువ సీట్లు ఆ పార్టీకి కేటాయిస్తానని ఆఫర్ కూడా ప్రకటించినట్టు సమాచారం.అయితే దీనిపై బీజేపీ పెద్దలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పొత్తుల గురించి ఆలోచిద్దామన్నది కేంద్ర పెద్దల భావన. అప్పటివరకూ చంద్రబాబు ప్రయత్నలేవీ ఫలించకపోవవచ్చు.

Pawan Kalyan- BJP
amit shah, Pawan Kalyan

అది జరిగితే మాత్రం…
ఒక వేళ జగన్ సర్కారుపై విపరీతమైన ప్రజావ్యతిరేకత ఉన్నా బీజేపీ పునరాలోచనలో పడే అవకాశం ఉంది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేలకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా కొందరు ఎమ్మెల్యేలు ప్రజలకు జరిగిన వ్యక్తిగత లబ్ధి గురించి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మాకు ఇస్తున్నది సరేగానీ… సమస్యల మాటేమిటి? అని జనం ఎదురు తిరుగుతున్నారు. ప్రధానంగా తాగునీరు, రహదారులు, మురుగునీటి కాలువలు, ఇసుక సమస్య, విద్యుత్తు చార్జీల పెంపుదల, చెత్త పన్ను, ఆస్తిపన్ను పెంపు, ధరల పెరుగుదల, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం… వంటి అంశాలపై ఎమ్మెల్యేలను జనం నిలదీస్తున్నారు. ప్రత్యేక హోదా నుంచి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటన వరకూ… మాటతప్పి, మడమ తిప్పిన అంశాలను గుర్తు చేస్తున్నారు. అయితే జగన్ ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఇటీవల ‘గడప గడపకు’ కార్యక్రమంపై వర్క్‌షాప్‌ పెట్టిన జగన్‌… ‘మనం చేస్తున్న సంక్షేమం గురించి చెప్పండి. ఇంటింటికీ జరిగిన లబ్ధి గురించి వివరించండి’ అని ఆదేశించారు. సమస్యల గురించి అడిగితే… ‘వాటిపై ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇవ్వండి’ అని సలహా ఇచ్చారు. ఇదేమాట తాము ప్రజలకు చెబితే… ‘రియాక్షన్‌’ ఎలా ఉంటుందో ఊహించుకుని ఎమ్మెల్యేలు బెంబేలెత్తుతున్నారు. మరోవైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే ఎన్నికల నాటికి ఇవి ముదరనున్నాయి. ఒక వేళ వైసీపీ పరిస్థితి తారుమారైతే మాత్రం టీడీపీ అందించే స్నేహ హస్తాన్ని బీజేపీ అందుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read:Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికలో బీజేపీ వ్యూహమేంటి?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular