BJP Focused On Khammam: ఆపరేషన్‌ కమలం: ఖమ్మంపై కాషాయ పార్టీ దృష్టి.. కేంద్ర మంత్రులు.. జాతీయ నేతల రాక

BJP Focused On Khammam: దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం.. బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణపై దృష్టిసారించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయంతోపాటు.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా కమల దళం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో ఢీ అంటే ఢీ అంటోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా ఇటీవలే రెండో విడత పాదయాత్ర ఉమ్మడి మహబూబ్‌నగర్‌ […]

Written By: NARESH, Updated On : April 21, 2022 10:50 am
Follow us on

BJP Focused On Khammam: దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం.. బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణపై దృష్టిసారించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయంతోపాటు.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా కమల దళం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో ఢీ అంటే ఢీ అంటోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా ఇటీవలే రెండో విడత పాదయాత్ర ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి షురూ చేశారు. హిందూ పరిరక్షణ, టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగడుతున్నారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ప్రజలకు వివరిస్తున్నారు. అధికారంలోకి వస్తే చే యబోయే పనులు చెబుతున్నారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలత్తో నూతనోత్సాహం కనిపిస్తోంది.

BJP Focused On Khammam

ఖమ్మంపై దృష్టి..
తెలంగాణలో బీజేపీకి ఖమ్మం జిల్లాలో పెద్దగా పట్టు లేదు. చెప్పుకోదగ్గ నాయకులు కూడా లేరు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన మినహా రాష్ట్రస్థాయి గుర్తింపు ఉన్న నాయకులు లేదు. ఈ క్రమంలో ఖమ్మంలో పట్టుకోసం కాషాయ నేతలు కొన్ని రోజులుగా కృషి చేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండి అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కమళదళంలో చేర్చుకునందుకు మంతనాలు మొదలు పెట్టారు. అయితే వారి చేరికపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.

Also Read: Covid Fourth Wave: కోవిడ్ నాలుగో వేవ్ వ‌స్తుందా ? భయపెడుతున్న ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్!

సాయిగణేశ్‌ ఆత్మహత్యతో..
బీజేపీ ఖమ్మం జిల్లా యువ నేత.. బీఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఇటీవల పోలీసుల వేధింపులు, తప్పుడు కేసుల కారణంగా పోలీస్‌ స్టేష¯Œ ఎదుటనే పరుగుల మందు తాగాడు. మంత్రి పువ్వాడ అజయ్‌ ప్రోద్బలంతో పోలీసులు తనపై ఏడాది కాలంలో 16 తప్పుడు కేసులు పెట్టారని, రౌడీషీట్‌ కూడా ఓపెన్‌ చేశాడని సాయిగణేశ్‌ తన మరణ వాగ్మూలం ఇచ్చారు. ఖమ్మంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి ఈ ఘటన కలిసి వచ్చింది. సాయి మరణించిన రోజు నుంచి గడిచిన నాలుగు రోజులుగా వరుస ఆందోళనలతో జిల్లా నేతలు దూకుడు పెంచారు. సాయి చనిపోయిన రోజే పట్టణ ంలో ఆందోళన చేశారు. ఆస్పత్రిపై దాడిచేశారు. మరుసటి రోజు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్రస్థాయి నాయకులు వివేక, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావుతోపాటు పలువురు సాయి గణేశ్‌ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

బాధిత కుటుంబానికి అమిత్‌షా ఫోన్‌..
సాయిగణేశ్‌ కుటుంబాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారం ఫోన్‌లో పరామర్శించారు. పొంగులేటి సుధాకర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్లారు. ఈ సమయంలోనే అమిత్‌షా సుధాకర్‌రెడ్డికి ఫోన్‌ చేసి సాయిగణేశ అమ్మమ్మతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బుధవారం కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌తోపాటు బీజేపీ లీగల్‌ సెల్‌ ఖమ్మంలో పర్యటించింది.

BJP Focused On Khammam

టార్గెట్‌ ‘పువ్వాడ’
సాయిగణేశ్‌ ఆత్మహత్య నేపథ్యంలో బీజేపీ జిల్లాలో పార్టీ పట్టు పెంచడంతోపాటు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌ను వీలైనంత ఎక్కువ డ్యామేజ్‌ చేయడమే లక్ష్యంగా కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే వరుస ఆందోళనలు కొనసాగిస్తున్నారు. జిల్లా మంత్రి పువ్వాడ రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్నారు. కర్ణాటకలో ఇటీవల ఓ కాంట్రాక్టర్‌ అక్కడి మంత్రి పేరు చెప్పి ఆత్మహత్య చేసుకోవడంతో సదరు మంత్రి విచారణ నిష్పక్షపాతంగా జరిగేందుకు రాజీనామా చేశారని, సాయిగణేశ్‌ ఆత్మహత్యకు కారణమైన పువ్వాడ కూడా రాజీనామా చేసి తన నిజాయతీ నిరూపించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో సీబీఐ విచారణకు బీజేపీ పట్టుబడుతున్నారు. తెలంగాణ పోలీసులు అధికార పార్టీకి గులాం గిరీ చేస్తున్నారని, పోలీసుల తప్పుడు కేసుల నేపథ్యంలోనే సాయి ఆత్మహత్య చేసుకున్నందున మంత్రి, పోలీసుల పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేరస్తున్నారు. ఈమేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు, బీజేపీ ప్రజాప్రతినిధులు ఆందోళన చేశారు. మంత్రి పువ్వాడ అజయ్, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు.

నేడు మరో మంత్రి రాక..
ఖమ్మం జిల్లాకు గురువారం మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెళ్లనున్నారు. సాయిగణేశ్‌ కుటుంబాన్ని మంత్రి పరామర్శిస్తారు. శుక్రవారం కూడా బీజేపీ నాయకులు ఖమ్మం వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇదే సమయంలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్మమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా శుక్రవారం ఖమ్మం రావాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ నేత కుటుంబంతోపాటు పువ్వాడ అజయ్‌ ప్రోద్బలంతో పోలీసులు తప్పుడు కేసులు, పీడీ యాక్టు పెట్టిన కాంగ్రెస్‌ నాయకులను కూడా కలువనున్నారు.

కేటీఆర్‌ పర్యటన వాయిదా..
వరుస ఆందోళనలతో రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు తన ఖమ్మం జిల్లా పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు బీఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడి ఆత్మహత్యకు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌ కారణమనే ఆరోపణల నేపథ్యంలో ఆయనతో కార్యక్రమాల్లో పాల్గొనక పోవడమే మంచిదన్న అభిప్రాయంలో కేటీఆర్‌ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈనెల 16న నిర్వహించే పర్యటన 18కి వాయిదా వేసుకున్నారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పర్యటన విరమించుకున్నారు.
మొత్తంగా ఖమ్మంపై పట్టు కోసం బీజేపీ చేస్తున్న పోరాటంలో కమలనాథులు కొంతవరకు సక్సెజ్‌సాధించినట్లే భావిస్తున్నారు.

Also Read:Telangana BJP: ప‌ద‌వి లేక‌పోతే ఫైర్ త‌గ్గుతుందా.. బీజేపీలో ఆ ముగ్గురికి ఏమైంది..?
Recommended Videos

Tags