Jinnah Tower in Guntur: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ప్రభుత్వం పై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. దేశద్రోహుల పేరుతో టవర్లు, సెంటర్లు ఉండకూడదని సూచిస్తున్నారు. గుంటూరు జిల్లా నడిబొడ్డున ఉన్న జిన్నా టవర్ పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఓ ట్వీట్ చేశారు. గుంటూరు నగరంలోని జిన్నా టవర్ పేరు మార్చాలని సూచిస్తున్నారు. దీంతో ఆయనకు మద్దతుగా పలువురు నిలుస్తున్నారు. సామాజిక మాధ్యమ వేదికగా ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది.
స్వాతంత్రానికి పూర్వమే జిన్నాను గుంటూరుకు ఆహ్వానించారు. కానీ ఆయన అక్కడికి రాలేదు. దీంతో ఆయన గుర్తుగా జిన్నా టవర్ పేరుతో టవర్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం దీనిపై వివాదం రేగుతోంది. దీనికి అబ్దుల్ కలాం, రచయిత జాషువా పేరు ఎందుకు పెట్టకూడదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారకుడైన దోశద్రోహి పేరు ఎందుకు ఉంచాలని నిలదీస్తున్నారు.
Also Read: నిధులు, అభివృద్ధి.. వైసీపీలో ముసలం.. జగన్ ను ముంచేస్తుందా?
దీంతో ఏపీ ప్రభుత్వం డోలాయమానంలో పడింది. టవర్ పేరు మార్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న క్రమంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనే అనుమానాలు వస్తున్నాయి. లేదంటే ఆ టవర్ ను బీజేపీ కార్యకర్తలే కూల్చివేస్తారని పిలుపులు వస్తున్న నేపథ్యంలో జగన్ మెడకు మరో ఉచ్చు బిగుసుకుంటోంది. తొలగించకపోతే బీజేపీతో కష్టమే అని తెలిసిపోతోంది.
సత్యకుమార్ ట్వీట్ తో అందరు ఏకీభవిస్తున్నారు. జిన్నా సెంటర్ ను మార్చకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఔరంగజేబు రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చిన నేపథ్యంలో జిన్నా సెంటర్ ను కూడా మార్చాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో జగన్ ప్రభుత్వానికి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా పరిస్థితి మారింది. ప్రస్తుతం జగన్ ఏమేరకు చర్యలు చేపడతారో అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: సీఎం జగన్ మనిషేనా…? మరి ఎందుకు ఇలా!