https://oktelugu.com/

KCR VS BJP: కేసీఆర్ మీడియాపై పడ్డ బీజేపీ.. మూసేస్తుందా?

KCR VS BJP: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయువు పట్టుపై పడింది బీజేపీ. కేసీఆర్ కు వెన్నుదన్నుగా బలంగా ఉన్న మీడియా వెన్ను విరిచేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ సంచలన ఫిర్యాదు చేసింది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం విన్నవించింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 23, 2022 / 06:20 PM IST
    Follow us on

    KCR VS BJP: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయువు పట్టుపై పడింది బీజేపీ. కేసీఆర్ కు వెన్నుదన్నుగా బలంగా ఉన్న మీడియా వెన్ను విరిచేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ సంచలన ఫిర్యాదు చేసింది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం విన్నవించింది. తెలంగాణ ఉద్యమకారులతోపాటు గిట్టని పార్టీలు, పత్రికలు, టీవీలపై విషం చిమ్ముతున్నాయని.. చట్ట సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలనే వక్రీకరిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.. యాడ్స్ పేరుతో రూ.వందల కోట్లు ఆ పత్రిక, ఛానల్ కు కేటాయిస్తూ సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నారన్నారని ఆరోపించారు.

    KCR VS BJP

    దీన్ని బట్టి అధికార టీఆర్ఎస్ కు బలమైన మద్దతుగా ఉన్న మీడియా వెన్ను విరిచేందుకు తెలంగాణ బీజేపీ రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేరళలో కేంద్రప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్న ఒక బలమైన మీడియాను కేంద్ర సమాచార శాఖ నిషేధించి షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా మీడియాకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు తెలంగాణలోనూ టీఆర్ఎస్ మీడియాపై బీజేపీ చర్యలు తీసుకునే దిశగా కనిపిస్తోంది.

    భావ ప్రకటనా స్వేచ్చ పేరుతో తెలంగాణ ఉద్యమకారులు, గిట్టని రాజకీయ పార్టీలు, పత్రికలు, ఛానళ్లపై విషం చిమ్ముతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్ ఛానల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు.

    బండి సంజయ్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రతినిధి బ్రుందం ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను, టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న తెలంగాణ ఉద్యమకారులపైనా, రాజకీయ పార్టీలపైనా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్ ఛానల్ అడుగడుగునా విషం చిమ్ముతున్నాయని ఈ సందర్భంగా వారు వివరించారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో రెచ్చగొడుతూ భౌతిక దాడులకు పురిగొల్పేలా పచ్చి అబద్దాలతో కథనాలు రాస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

    పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయా పత్రిక, ఛానల్ వక్రీకరిస్తూ ప్రధానమంత్రి గౌరవానికి, పార్లమెంట్ పవిత్రకు భంగం కలిగించేలా వ్యవహరించాయని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ది, ప్రజల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం పాటుపడుతుంటే ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అభ్యంతరం వ్యక్తం చేశారు.

    KCR VS BJP

    Also Read: KCR Delhi Tour: గ‌ల్లీలో అధికారం కోస‌మే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారా?

    అట్లాగే అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొనసాగిస్తున్న దోపిడీకి, అవినీతికి రక్షణ కవచంగా నిలిచిన నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఛానల్ కు కేసీఆర్ ప్రభుత్వం గత ఏడేళ్లలో అడ్వయిర్జైజ్ మెంట్ల పేరుతో వందల కోట్ల ను కేటాయించిందన్నారు. ఈ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా ప్రభుత్వ ఖజనాకు గండి కొడుతున్నారని పేర్కొన్నారు.

    టీఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లోనే టీ న్యూస్ నడుస్తోందన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే టీ న్యూస్ నడుస్తోందని తెలిపారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్ ఛానళ్లపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

    తెలంగాణ బీజేపీ తీరు చూస్తుంటే ఖచ్చితంగా అధికార పార్టీకి షాక్ ఇచ్చేలాగానే పరిస్థితి కనిపిస్తోంది. మరి దీన్ని కేసీఆర్ సర్కార్ ఎలా ఎదుర్కొంటుందన్నది వేచిచూడాలి.

    Also Read: AP BJP Leaders: ఏపీ బీజేపీ నేత‌ల మాట‌ల‌కు విలువ లేదా?

    Tags