
రాష్ట్రంలో ఊపుమీద ఉన్న కమలం పార్టీ.. మరో సమరానికి వ్యూహం పన్నుతోంది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలల్లో గులాబీకి షాక్ ఇచ్చిన కాషాయ దండు.. గ్రేటర్ మేయర్ పీఠంపై కన్నేసింది. గ్రేటర్ మేయర్ ఎన్నిక గురువారం జరగనుంది. ఏ పార్టీకి పూర్తిస్థాయిలో మెజారిటీ వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అసలు ఎన్నిక కూడా సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు తాము బరిలో దిగబోమని చెబుతూ వచ్చిన బీజేపీ అనూహ్యంగా తన వ్యూహాన్ని మార్చుకుంది. పోటీలో ఉండాలని నిర్ణయం తీసుకుంది.
Also Read: తొలివిడత ఫలితాలు.. ఎవరిగోల వారిది..
మేయర్ ఎన్నిక విధానంలోనూ మార్పు చేశారు. మేయర్ ఎన్నికకోసం మేజిక్ ఫిగర్ అవసరం లేదు. మెజారిటీ ఉంటే చాలు. ఓటింగ్ లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే.. వారు మేయర్ గా ఎన్నిక అవుతారు. ప్రస్తుతం గ్రేటర్ లో టీఆర్ఎస్ కు 56,బీజేపీకి 48, ఎంఐఎంకు 44, కాంగ్రెస్ కు ఇద్దరు చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు. ఒక బీజేపీ కార్పొరేటర్ చనిపోవడంతో ఓటింగులో పాల్గొనే అవకాశం లేదు. అన్ని పార్టీలకు కలిపి మరో 44మంది ఎక్స్ అఫీషియో మెంబర్లు ఉన్నారు.
ఎక్స్ అఫీషియో మెంబర్లతో కలిపి టీఆర్ఎస్ కు 88 ఓట్ల బలం ఉంది. తరువాత ఎంఐఎంకు 54 ఓట్ల బలం ఉంది. మ్యాజిక్ ఫిగర్ వంటి రూలేమీ లేదు. దీంతో మిగితా పార్టీలకన్నా ఎక్కువ ఓట్లున్న టీఆర్ఎష్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మేయర్ ఎవరన్నదానిపై టీఆర్ఎస్ లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు జరిగే రోజునే మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను సీల్డు కవర్లో తెలంగాణ భవన్ కు పంపుతానని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు తెలంగాణ భవన్ లో సీల్డ్ కవర్ ఓపెన్ చేస్తారు. మేయర్, డిప్యూటీ మేయర్ క్యాండిడెట్ల పేర్లు ప్రకటిస్తారు.
Also Read: ఏపీలోని ఆ గ్రామంలో ఒక్క ఓటుకు 40 వేల రూపాయలు..?
అయితే మేయర్ పదవిని తమ వారసులకు ఇప్పించేందుకు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. బలం ప్రకారం మూడోస్థానంలో ఉన్నప్పటికీ.. బీజేపీ సైతం పోటీ చేస్తోంది. రెండో స్థానంలో ఉన్న ఎంఐఎం కూడా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. టీఆర్ఎస్ పై మజ్లిస్ ముద్ర పడకుండా ఉండాలంటే.. పోటీ చేయక తప్పదు. టీఆర్ఎస్ సూచనలను ఎంఐఎం పాటించడానికే ఎక్కవ అవకాశం ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Comments are closed.