Homeజాతీయ వార్తలుAnnamalai: కొరడాతో కొట్టుకున్నాడు.. చెప్పులు వేసుకోనని శపథం చేశాడు.. బీజేపీ చీఫ్‌ అన్నామలై కీలక నిర్ణయం.....

Annamalai: కొరడాతో కొట్టుకున్నాడు.. చెప్పులు వేసుకోనని శపథం చేశాడు.. బీజేపీ చీఫ్‌ అన్నామలై కీలక నిర్ణయం.. కారణం తెలుసా?

Annamalai: రాజకీయాల్లో సవాళ్లు ప్రతిసవాళ్లు సర్వ సాధారణం. ఆరోపణలు, ప్రత్యారోపణలు కామన్‌. ఇక ఇటీవల దేవుళ్లపై ప్రమాణాలు, ఒట్టు వేయడం కూడా జరుగుతోంది. ప్రజల మద్దతు కూడగట్టేందుకు నేతలు ఇలాంటి రాజకీయాలు చేస్తారు. కొన్ని సవాళ్లు శాంతిభద్రతల సమస్యగా కూడా మారుతున్నాయి. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ నేత కొరడాతో కొట్టుకోవడంతోపాటు, చెప్పులు కూడా వేసుకోనని శపథం చేశాడు. అతను ఎందుకు ఇలా చేశాడు, శపథం వెనుక ఉన్న కారణం ఏంటి తెలుసుకుందాం.

తమిళనాడు రాజకీయాలో రెండు ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం. అక్కడ జాతీయ పార్టీలకు చాలా ఏళ్లుగా అవకాశం దక్కడం లేదు. కాంగ్రెస్‌ అప్పట్లో అధికారంలోకి వచ్చింది. బీజేపీ మాత్రం ఇప్పటికీ తమిళనాడులో అధికారం కాదు కదా, కనీసం సంకీర్ణంలో కూడా భాగస్వామిగా లేదు. తమిళ ఓటర్లు కమలం పార్టీని ఆదరించడం లేదు. దానిని ఉత్తరానది పార్టీగా చూస్తున్నారు. భాషాభిమానంంతోపాటు, రావణాసురుని భక్తులుగా తమిళులు గుర్తింపు పొందారు. అందుకే రాముడిని కొలిచే తలిచే బీజేపీని తిరస్కరిస్తున్నాడు. అయతే కొన్నాళ్లుగా అక్కడ కూడా పరిస్థితి మారుతోంది. చాలా మంది కమలం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కమలం పార్టీని తమిళనాడులో అధికారంలోకి తీసుకురావడానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలను ఆకట్టుకునేందుకు తాజాగా శపథం చేశారు. రాష్ట్రంలో డీఎంకేను అధికారం నుంచి గద్దె దించే వరకూ చెప్పులు వేసుకోనని స్పష్టం చేశాడు. ఇక రాష్ట్రంలో దుష్ట పాలనను నిరసిస్తూ శుక్రవారం కొరడాతో ఆరు దెబ్బలు కొట్టుకుంటానని కూడా ప్రకటించారు.

లైంగికదాడికి నిరసనగా..
ఇక తమిళనాడులో దుష్ట పాలన కారణంగానే అమ్మాయిలపై లైంగికదాడులు జరుగుతున్నాయని ఆన్నామలై ఆరోపించారు. ఇటీవల అన్న యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేదింపులకు నిరసనగా అన్నామలై కొరడాతో ఆరు దెబ్బలు కొట్టుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ బాధితురాలే భయపడేలా ఉందని పేర్కొన్నారు.

ప్రశ్నించడమే మా పని..
ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రతిపక్షంగా తమ పని అని తెలిపారు. వాటికి సమధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అన్నా యూనివర్సిటీలో సీసీ కెమెరాలు లేవని చెప్పడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షిణిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు తాను చెప్పులు వేసుకోని స్పష్టం చేశారు. శుక్రవారం అన్ని చెడులు తొలగిపోవాలని తన ఇంటి ఎదుట కొరడాదెబ్బలు కొట్టుకున్నారు. తమిళనాడులోని మురుగన్‌ ఆరు పవిత్ర క్షేత్రాలకు వెళ్లడానికి తాను 48 గంటలు దీక్ష చేస్తానని తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular