Dissidence TRS Leaders: తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు వస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ లో అసంతృప్తులను తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ లు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే వ్యూహాలు అమలు చేసేందుకు సిద్ధమవుతన్నాయి. టీఆర్ఎస్ లో ఎలాంటి లాభం లేకుండా పోవడంతో నేతలు పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుసుకుని వారిని తమ వైపు రప్పించుకోవాలని ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే పలువురిని సంప్రదిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈనేపథ్యంలో మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఆమె భర్త ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఇంకా కొంత మంది తమతో టచ్ లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు. దీంతో బీజేపీ కూడా తమ పార్టీలో చేర్చుకోవాలని కొందరు నేతలతో సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి దూకుడుతో వ్యవహరిస్తూ పార్టీలో నేతలను చేర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read: Pawan Kalyan CM Candidate: పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్.. టీడీపీతో పొత్తుకు బీజేపీ ముందస్తు షరతు?
ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు తమతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు వెల్లడిస్తున్నారు. కాంగ్రెస్ లో ఊపు తీసుకొచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో బీజేపీ నేతలు కూడా తమ పార్టీలో చేర్పించాలని చూస్తున్నారు. ఏ పార్టీలో ఎక్కువ మంది చేరితే అంత మైలేజీ వస్తుందనే ఉద్దేశంతోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో పెద్ద ఎత్తున పార్టీలో చేరుతారని భావించినా ఎవరు చేరకపోవడంతో ఇప్పుడు చేర్చుకోవాని చూస్తున్నట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేరతారనే ప్రచారం సాగినా అది సాధ్యపడలేదు. ఈ క్రమంలో విశ్వేశ్వర్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనే వార్తలు కూడా వస్తున్నాయి. అందరిని బీజేపీలో చేర్చుకోవాలని చూస్తోంది. ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.