Casino in AP: జూదం.. దీని చరిత్ర గురించి అందరికీ తెలిసిందే.. మహాభారతంలోనే ధర్మరాజు జూదం ఆడి రాజ్యాన్ని సంపదను, ఆఖరుకు కట్టుకున్న భార్యను కోల్పోయాడు. ఆ భయాలు ఉన్నాయి కాబట్టి భారతదేశంలో ఈ జూదం ఆటలను నిషేధించారు. ఇప్పటికీ ఇది ప్రజల ఆస్తులు,ఇళ్లు, ఒళ్లు గుల్ల చేస్తుందని ఒక భయం ఉంది.
అయితే తాజాగా ఏపీలోని గుడివాడలో మంత్రి కొడాలినాని ‘క్యాసినో’ (జూదం) మొదలుపెట్టారని.. ఇక ఏపీ ప్రజలు లక్షలు తగలేయడానికి గోవా వెళ్లకుండా ఏపీలోనే ఆడి ఇక్కడి సంపదను పెంచాలని ఒక ‘బిలియన్ డాలర్ల’ ఐడియాను ఏపీ సర్కార్ కు ఇచ్చాడు. అయితే ఇళ్లు గుల్ల చేసే ఈ ఐడియాను అమలు చేయడానికి ఏపీప్రభుత్వానికి అయితే ధైర్యం లేదు. ఇప్పటికే మద్యం నిషేధం అంటూ అమ్మకాలు పెంచి సొమ్ము చేసుకుంటున్న వైనంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పుడు ఈ క్యాసినో జూదం జోలికి పోయే సాహసం చేయకపోవచ్చు.
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ క్యాసినోలు, జూదానికి పర్మిషన్ ఉంది. పెద్ద కాసినోలు ఆడడం కేవలం విదేశీయులకు మాత్రమే పరిమితం చేయబడింది. భారతీయులు కోటా ప్రాతిపదికన.. లేదా పెట్టుబడి పరమితిపై మాత్రమే ఆడేందుకు అవకాశం ఇచ్చారు.
2019 ఆర్థిక సంవత్సరంలో క్యాసినోల ద్వారా రూ.411 కోట్ల ఆదాయాన్ని ఆర్జించామని గోవా ముఖ్యమంత్రి ప్రకటించారు ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్లలో టిక్కెట్ల అమ్మకాలపై సంపాదిస్తున్న దానికంటే కూడా ఈ సంఖ్య 10 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఏపీ మంత్రి ప్రస్తుతం గుడివాడలో నిర్వహిస్తున్న ఈ క్యాసినోను ఏపీ ప్రభుత్వం విస్తరిస్తుందన్న ప్రచారం ఉంది. అయితే అలా చేస్తే మాత్రం ప్రజల నుంచి తీవ్ర విమర్శలు తథ్యం.. ఆదాయం వచ్చినా అంతకుమించిన అవమానాలు మాత్రం రావడం ఖాయం.
అయితే జూదం అధికారికంగా ఆడనిస్తే అది ప్రజల ధన, ఆర్థిక కష్టాలకు కారణమవుతుంది. ఎంత సంపాదన వచ్చినా వారిని చెడు మార్గంలో పయనించేలా చేస్తుంది. అందుకే కోట్ల బిలియన్ డాలర్ల సంపాదన వచ్చినా దేశంలో రాష్ట్రాల్లో క్యాసినోలు, జూదాలకు ఇప్పటికీ అనుమతులు లేవు. లేకుంటేనే ప్రజలకు మంచిది అనడంలో ఎలాంటి సందేహం లేదు.