Bihar is a poor state: బీహార్ రాష్ట్రంలో అక్కడి శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ ఎన్నికలు నేడు ప్రారంభమయ్యాయి. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఈ కథనం రాసే సమయం వరకు బీహార్ రాష్ట్రంలో 48 శాతం పోలింగ్ నమోదయింది. సహజంగానే బీహార్ రాష్ట్రం పేరు చెప్తే ఎవరికైనా సరే బీద రాష్ట్రం గుర్తుకొస్తుంది. ఆ రాష్ట్రంలో సరైన ఉపాధి అవకాశాలు ఉండవని.. అందువల్ల యువత ఇతర ప్రాంతాలకు వలస వెళుతుందని.. ప్రాంతీయ మీడియా నుంచి మొదలు పెడితే జాతీయ మీడియా వరకు వార్తలు వస్తూనే ఉంటాయి.. పైగా బీహార్ రాష్ట్రాన్ని బీమారి ప్రాంతంగా పేర్కొంటారు. పైగా ఇక్కడ నిరక్షరాస్యత అధికంగా ఉంటుంది. పేదరికం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కులాల కుంపట్లు ఇక్కడ ఎక్కువగా రగులుతూ ఉంటాయి.
ఇక్కడి ప్రజలలో కులం అనే భావన విపరీతంగా నాటుకుపోయింది. అందువల్లే ఇటీవలి ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు పదేపదే కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రజల మధ్య కులం అనే భావనను మరింత పెంపొందించారు. ప్రజల మధ్య కులాల కుంపట్లను మరింత రగిలించి.. ఆ మంటలు చలి కాచుకోవడానికి ప్రయత్నించారు. అంతేకాదు ఓటర్లను ప్రసాదం చేసుకోవడానికి అనేక తాయిలాలు ప్రకటించారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి.
బీహార్ రాష్ట్రంలో గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఖర్చు ఇంతగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు అంతకుమించి అనే స్థాయిలో బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. అయితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడానికి రోడ్డు మార్గంలో అయితే సమయం పడుతుంది కాబట్టి.. లోహ విహంగాలను ఉపయోగించుకుంటున్నారు.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్లో ఉంది.
బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులు విభిన్నంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. నాయకులు ఒకేరోజు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇలా వేగంగా ప్రచారం చేయడానికి రాజకీయ నాయకులు హెలికాప్టర్లను వాడుతున్నారు. రోడ్డు మార్గంలో అయితే సమయం ఎక్కువగా పడుతుంది కాబట్టి.. హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు.. పాట్నా విమానాశ్రయంలో వరుసగా హెలికాప్టర్లు పార్క్ చేసి ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది.. బీహార్ రాష్ట్రాన్ని చాలామంది పేద ప్రాంతం అని పిలుస్తుంటారు.. ఇన్ని హెలికాప్టర్లు పార్క్ చేసి ఉన్న తర్వాత ఆ రాష్ట్రాన్ని పేద ప్రాంతమని ఎలా అనాలని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
These are the helicopters lined up for Bihar elections at Patna airport. If anybody says india is a poor country,well he needs a reboot. pic.twitter.com/TnmKbSLJ7C
— Lt Col Sushil Singh Sheoran, Veteran (@SushilS27538625) November 5, 2025