Bihar Election 2025 Results: బీహార్.. వెనుకబడిన రాష్ట్రమైనప్పటికీ.. రాజకీయ చైతన్యం ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రాజకీయాలు కూడా చిత్రచిత్రంగా ఉంటాయి. కుల సమీకరణాలు అధికంగా ఉంటాయి. అయితే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సగం సీట్లలో అగ్రవర్ణాలు పోటీచేశాయి. ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఎన్డీఏ కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. తేజస్వి యాదవ్ కు యువతలో విపరీతమైన పాపులారిటీ ఉన్నప్పటికీ.. అధికారానికి ఆయన కూటమి దూరంగానే ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పేర్కొన్నాయి. మరోవైపు సర్వేలు మొత్తం ఫేక్ అని.. అవన్నీ మోడీ చెప్పినట్టుగానే చేశాయని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. రాజకీయ నాయకులు.. ఎగ్జిట్ పోల్స్ సంస్థల అంచనాలు ఎలా ఉన్నప్పటికీ.. బీహార్ రాష్ట్రంలో ఎన్నికల పోరుమాత్రం నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. మరికొద్ది గంటల్లో ఎన్నికల ఫలితం విడుదలవుతున్న నేపథ్యంలో.. బీహార్ లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిస్తే..
ఎవరి లెక్కలు వారివే
బీహార్ రాష్ట్రంలో 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈసారి ఎన్నికలు జోరుగా సాగాయి. నువ్వా నేనా అన్నట్టుగా పార్టీల మధ్య పోరు జరిగింది. ఆర్ జె డి కి ముస్లిం, యాదవుల రూపంలో దాదాపు 32 శాతం విలువైన ఓటు బ్యాంకు ఉంది. ఎన్డీఏ కూటమికి అగ్రవర్ణాలు, లవ్ – కుష్, దళిత, మహా దళితులు అండగా నిలిచారు. ఈ రెండు కూటముల తలరాతను మార్చే శక్తి 36% ఉన్న ఈ బీసీలకు ఉంది. గతంలో ఈ వర్గం నితీష్ వైపు నిలిచింది. ఈసారి కుల గణన తర్వాత ఎటువైపు వెళుతుంది అనేది చూడాల్సి ఉంది. అయితే ఇందులో ఉన్న మెజారిటీ వర్గాలు మాత్రం నితీష్ వైపు జై కొట్టాయాని తెలుస్తోంది. ఈ వర్గాలకు కూడా నితీష్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించడంలో విజయవంతమైంది. దీంతో గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఈ వర్గాలు నితీష్ కు మద్దతు పలికినట్టు తెలుస్తోంది.
బీహార్ లో గతంలో ఏం జరిగిందంటే..
బీహార్ రాష్ట్రంలో 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అధికారాన్ని ఏర్పాటు చేయాలంటే 122 స్థానాలు సంపాదించుకోవాలి. గత ఎన్నికల్లో బిజెపికి 80, ఆర్ జె డి కి 77, జెడియుకు 45, కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్, లిబరిస్ట్ కు 11 మంది ఎమ్మెల్యేలు, హిందుస్థాని అవామ్ మోర్చా కు నలుగురు, స్వతంత్రులు కలిపి ఏడుగురు ఉన్నారు. అయితే ఈసారి ఈ లెక్కలు మారుతాయని తెలుస్తోంది.
పకడ్బందీ వ్యూహంతో..
అధికార ఇండియాలోని బిజెపి, జేడియు, ఎల్ జె పి (ఆర్వి), హామ్, ఆర్ ఎల్ ఎం ల కూటమి.. ప్రత్యర్థి ఓటు బ్యాంకును చీల్చడంతో పాటు.. తన సామాజిక వర్గాలను ఏకం చేసే పకడ్బందీ వ్యూహంతో రంగంలోకి దిగింది. దానిని విజయవంతం చేసిందని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీకి సంప్రదాయంగానే అగ్రవర్ణాల ఓటు బ్యాంకు ఉంది. ఈసారి కులగన తర్వాత వారు ఈ బీసీ, ఓ బి సి వర్గాలలోకి వెళ్లిపోయారు. అగ్రవర్ణాలకు కూడా అభ్యర్థుల జాబితాలో పెద్దపీట వేస్తూ ఎన్ డి ఏ సోషల్ ఇంజనీరింగ్ చేసినట్టు తెలుస్తోంది. నితీష్ కుమార్ కు లవ్ కుష్(కురిమి సామాజిక వర్గం) 2.87, కుష్వాహ/ కొయిరి 4.2% సామాజిక వర్గాలు మరోసారి సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా దశాబ్దాల కాలంగా నితీష్ కుమార్ ను 36% ఈ బీసీలు నమ్ముకున్నారు. ఈసారి కూడా వారు ఆయనకు జై కొట్టినట్టు తెలుస్తోంది.
మిత్రపక్షాల పరిస్థితి ఏంటంటే?
మిత్రపక్షమైన చిరాగ్ పాశ్వాన్ దళితులలో బలమైన వర్గమైన చుసాద్ ఓట్లను (సుమారు 5.5%) ఎన్డీఏ వైపు తిప్పినట్టు తెలుస్తోంది.. జితన్ రామ్ మాంజి పార్టీ ప్రధానంగా మహా దళితుల(ముసార్ 13 శాతం) ఓట్లను కూటమికి పడేలా చేసింది. ఉపేంద్ర కుస్వాహా (ఆర్ ఎల్ ఎం) లవ్ కుష్ సమీకరణం లోని కుష్వాహ ఓట్లను మరింత ఏకీకృతం చేసినట్టు తెలుస్తోంది. ఇవన్నీ అనుకున్నట్టు జరిగాయని.. అందుకే తాము అధికారంలోకి మళ్ళీ వస్తున్నామని ఎన్ డి ఏ నేతలు చెబుతున్నారు.