Former Minister Narayana: నవ్వి పోదురుగాక నాకేంటి అన్న చందంగా మారింది ఏపీ ప్రభుత్వ పెద్దల దుస్థితి. పూర్తిగా అధికార మదంతో విర్రవీగుతున్న వారికి పూర్తిగా కళ్లు బైర్లు కమ్మేసాయి. తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితిలోకి వారు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమమైనా, అభివ్రద్ధి పనులైనా, ప్రత్యర్థులపై కేసులు పెట్టినప్పుడైనా సరిగ్గా సమీక్షించుకోవాల్సిన అవసరముంది. కానీ అవేవీ చేయకుండా క్షేత్రస్థాయిలో అమలు చేసినప్పుడు ఫెయిలవుతున్నారు. ప్రజల్లో చులకన అవుతున్నారు. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ఎపిసోడ్ నే తీసుకుందాం. అదరాబాదరగా అరెస్ట్ చేశారు. కానీ కొన్ని గంటల్లోనే ఆయనకు బెయిల్ లభించింది. టెన్త్ పేపర్ లీకయిందో.. మాల్ ప్రాక్టిస్ జరిగిందో కూడా క్లారిటీ లేకుండా ఓ సారి లీక్ అని..మరోసారి మాల్ ప్రాక్టీస్ అని చెబుతూ..ఈ కేసులో ఏకంగా నారాయణ స్కూల్ ఫౌండర్ చైర్మన్ నారాయణను అరెస్ట్ చేసేశారు.
నిందితులు అందరూ ఇప్పుడు, గతంలో కూడా నారాయణ స్కూల్స్‌లో పని చేశారని.. నారాయణే పేపర్ లీక్ చేయమని ఆదేశాలిచ్చారని.. అందుకే అరెస్ట్ చేశామని వాదిస్తున్నారు. ఈ విషయంలో జగన్ అనుకూల మీడియా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. పతాక శీర్షికన కథనాలు, వార్తలు వండి వర్చారు. భారీ నేరమని.. ఇన్నాళ్లకు శిక్ష పడిందని చెప్పుకొచ్చారు. విద్యావ్యవస్థ సంక్లిష్టతకు నారాయణే కారణమన్నారు.పలువలు చిలువలు చేసి వ్యాఖ్యానాలు చేశారు. సాక్షి పత్రికలో అయితే పేజీ పేజీలు నారాయణ అరెస్ట్ కథనానికే కేటాయించారు. పోనీ నారాయణ తప్పు చేశారని భావిస్తే.. అందుకు తగ్గట్టు ఆధారాలు పూర్తిస్థాయిలో సేకరించిన తరువాత హడావుడి చేస్తే బాగుంటుంది. కానీ అవేవీ చేయకుండా నారాయణ మంత్రం పఠించారు. ఎంచక్కా నారాయణ తాను ఇప్పుడు నారాయణ విద్యాసంస్థలకు సంబంధించి ఎలాంటి పదవుల్లో లేనని.. అసలు నాకు సంబంధమే లేదంటూ కోర్టులో ఏక వాక్యం చేసి బెయిల్ తెప్పించుకున్నారు. దీంతో ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది.
Also Read: Sedition Law: ఇక రాజద్రోహం కేసు కుదరదు.. పాలకులకు సుప్రిం కోర్టు షాక్
పై కోర్టకు వెళతారట..
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పల్లవి అందుకుంది. నారాయణపై పై కోర్టుకు వెళతామని చెప్పకొస్తున్నారు. అయితే ఈ కేసు పై కోర్టులో సైతం నిలబడదని ప్రభుత్వ పెద్దలకు తెలుసు. కానీ తాము చేసిన హడావుడి భూమరంగ్ కావడంతో సంత్రుప్తి చెందే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ సలహదారు సజ్జల మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. ఎప్పట్లాగే న్యాయవ్యవస్థను చంద్రబాబు మేనేజ్ చేశారని ఆరోపించారు. అంతటితో ఆగలేదు.. ఏదో అయిపోయిందన్నట్లుగా మూడున్నరకు బెయిల్ ఇచ్చారని ఆరోపించారు. వారు ఆ సమయంలో కోర్టులో ప్రవేశ పెట్టారు కాబట్టి ఆ సమయంలో బెయిలిచ్చారనే్ సంగతి ఎవరికీ తెలియనట్లుగా సజ్జల నటించేస్తున్నారు. బెయిల్ రద్దు కోసం పైకోర్టుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటించారు.
నారాయణ ను రిమాండ్ కు తరలించడానికి రిమాండ్ రిపోర్ట్ కూడా రెడీచేశారు. అందుకో నిందితులంతా ఒకే రకమైన వాంగ్మూలం ఇచ్చారు. అందరూ కూడబలుక్కుని నారాయణే తమకు లీక్ చేయమని చెప్పారన్నట్లుగా స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్‌మెంట్లనే రిమాండ్ రిపోర్టుగా చూపించారు. మొత్తంగా నారాయణ అరెస్టు ప్రజల్లో ఓ రకమైన భావన ఏర్పడటంతో సజ్జల కవర్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్.. విద్యా మాఫియా అంటూపెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. తప్పు చేసి దొరికిపోయిన వారిలో ఉండే కంగారు సజ్జల మొహంలో కనిపిస్తోందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read:Viveka Murder Case: ఫులివెందులలో సీబీఐని బెదిరించిన ఆ ముసుగు మనిషి ఎవరు?
Recommended Videos