Joe Biden: అగ్రరాజ్యం అమెరికా శక్తి ఏమిటో అందరికి తెలుసు. ప్రపంచ దేశాల్లో అత్యంత సంపన్న దేశంగా సైనిక బలగమున్న రాజ్యంగా అందరికి సుపరిచితమే. ఇటీవల డ్రాగన్ తైవాన్ విషయంలో అతి చేస్తోంది. ఆ దేశ గగనతలంపై చక్కర్లు కొడుతూ దాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో తైవాన్ భయాందోళన వ్యక్తం చేస్తోంది. చైనా దురాగాతాన్ని ఎండగట్టాలని చూస్తోంది. కానీ దానికి సరైన మిత్రదేశం లేకుండా పోతోంది. దీంతో డ్రాగన్ కుయుక్తులను అమెరికా ఖండిస్తోంది. తైవాన్ కు తాము అండగా నిలుస్తామని భరోసా ఇస్తోంది.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు.తైవాన్ ను ఆదుకుంటామని భరోసా కల్పిస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పేద దేశమైన తైవాన్ కు అమెరికా అండగా నిలవడం నిజంగా ఆహ్వానించదగినదే అని అన్ని దేశాలు భావిస్తున్నాయి. చైనా దురాగాతాల్ని ఖండించాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికా తెలియజేస్తోంది.
తైవాన్ సైతం చైనా దుందుడుకు చర్యలను ఖండిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి భయపడేది లేదని తేల్చి చెబుతోంది. చైనా ఒత్తిళ్లకు ఎటువంటి స్థితిలో కూడా తలొగ్గేది లేదని చెబుతోంది. దీంతో తైవాన్ కు అమెరికా మద్దతు పలకడంతో అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తైవాన్ ను ఏకాగికా చేస్తూ తన పబ్బం గడుపుకోవాలని భావిస్తున్న తరుణంలో అమెరికా అండగా నిలవడం సమంజసమే.
ప్రపంచంలోని అన్ని దేశాలకు అమెరికా బలమేమిటో తెలిసిందే. అందుకే తైవాన్ కు ప్రస్తుతం భయమేమీ లేకుండా పోతోంది. అగ్రరాజ్యం సైనిక బలగం గురించి ఆందోళన లేకుండా తైవాన్ కు సైతం బలం పెరుగుతోంది. చైనా కుయుక్తులను ఎండగట్టేందుకు వెనకాడటం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా చర్యలను అందరు ఆహ్వానిస్తున్నారు. చిన్న దేశానికి మద్దతు పలకడంతో న్యాయం గెలిచినట్లవుతుందని అభిప్రాయపడుతున్నారు.