Pawan Vs Jagan: చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి లాంటి దిగ్గజ సినీ ప్రముఖులు తరలివచ్చి 15 రోజులు దాటిపోయింది. జగన్ ను వేడుకున్నారు. సినీ పరిశ్రమ కష్టాలు తీర్చాలన్నారు. జగన్ కొన్ని కోరికలు కూడా కోరారు. వాటిని తీరుస్తామని సినీ ప్రముఖులు హామీ ఇచ్చారు. అయితే వారంలో దీనిపై జీవో ఇస్తానన్న జగన్ ఇన్ని రోజులు అవుతున్నా ఉలుకూ లేదు..పలుకూ లేదు. ఇన్ని రోజులవుతున్నా టాలీవుడ్ ను కరుణించలేదు. దీనంతటికి పవన్ కళ్యాణ్ యే కారణమన్న విమర్శలున్నాయి.
పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈనెల 25నే ఈ సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక రిలీజ్ కు ముందు నర్సాపురంలో పవన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ దగ్గరకు ఆయనకు పెద్ద ప్రముఖులు వచ్చి కూడా బతిమిలాడాలని.. వేడుకోవాలని..మీరే దిక్కు అంటేనే ఆయన కరుణించి సమస్యలు తీరుస్తాడని తీవ్రంగా దుయ్యబట్టారు. తన అన్నయ్య చిరంజీవి సహా సినీ ప్రముఖులంతా పోయి కోరినా జగన్ సమస్యలు తీర్చడం లేదని మండిపడ్డారు.
ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీకి జగన్ తీరు అర్థమైంది. కేవలం పవన్ కళ్యాణ్ మీద కోపంతోనే జగన్ సినిమా టికెట్ రేట్లను తేల్చడం లేదని.. ‘భీమ్లా నాయక్’ విడుదల అయితే తప్ప సినీ ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారం కావని తెలుస్తోంది.
Also Read: వైఎస్ వివేకా కేసు: చిక్కుల్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి?
ఇండస్ట్రీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ రిలీజ్ కోసం ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తోంది. దాన్ని విడుదల చేయాలని ఇండస్ట్రీ పెద్దలు కూడా ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అది పాత ధరలకే అమ్ముడైతేనే జగన్ కరుణిస్తాడని.. టికెట్ రేట్లు పెంచుతాడని.. ఇండస్ట్రీ సమస్యలు తీర్చుతాడని సినీ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి.
మరి క్లిష్ట వాతావరణంలో భీమ్లా నాయక్ ను ఎలాగైనా రిలీజ్ చేయాలనే మేకర్స్ కూడా తాజాగా హడావుడిగా ట్రైలర్ రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. సినిమాను కూడా అంతే హడావుడిగా పూర్తి చేసినట్టు సమాచారం. మరి దాని ఫలితం ఎలా ఉంటుందనేది ఫిబ్రవరి 25న రిలీజ్ రోజే తెలియనుంది.
Also Read: ఏపీలో జవహర్ రెడ్డిదే అంతా నడుస్తోందా?
Recommended Video: