Bengaluru cop caught red-handed: అతడు ఒక పోలీసు అధికారి. జీతం నెలకు లక్ష పైచిలుకు ఉంటుంది. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు కూడా భారీగానే వస్తుంటాయి. ఆ స్థాయి హోదా ఉన్న వ్యక్తి లంచాలకు మరిగాడు. డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. లంచాల ద్వారా వస్తున్న డబ్బులు సరిపోకపోవడంతో మరింత దోపిడీకి పాల్పడ్డాడు. ఇలా భారీగా వెనకేసుకున్నాడు.
అతడి మీద ఉన్నతాధికారులకు ఎప్పటినుంచో అనుమానం ఉంది. పైగా ఇతడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఖరీదైన బంగ్లాలు.. అంతకుమించి అనే స్థాయిలో ఇళ్ల స్థలాలు కలిగి ఉండి వైభోగాన్ని అనుభవిస్తున్నాడు. అయితే ఇతడి మీద పోలీసులకు కొద్దిరోజులుగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించిన తర్వాత చర్యలకు ఉపక్రమించారు.
సదరు పోలీస్ అధికారి ఇటీవల ఒక బిల్డర్ నుంచి నాలుగు లక్షల లంచం తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఆ బిల్డర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.. పోలీసులు అరెస్ట్ చేస్తుంటే సదరు అధికారి అరుపులు పెట్టాడు. కేకలు వేశాడు. కన్నీటి పర్యంతమయ్యాడు. అయినప్పటికీ పోలీసు అధికారులు ఊరుకోలేదు. అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
కర్ణాటక రాష్ట్రంలోని కెపి అగ్రహార పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ గా గోవిందరాజు పనిచేస్తున్నాడు. అతడు చామరాజుపేటలోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్స్ లో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మోసం కేసులో పేరు లేకుండా చేయాలని మహమ్మద్ అక్సర్ అనే బిల్డర్ ఇన్స్పెక్టర్ ను సంప్రదించాడు. దానికి అతడు ఐదు లక్షలు లంచం అడిగాడు. ఇందులో భాగంగా ఇటీవల నాలుగు లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆ బిల్డర్ కర్ణాటక లోకాయుక్త పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వారు సదరు పోలీస్ అధికారిని పట్టుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో సదరు ఇన్స్పెక్టర్ ఏడ్చాడు. తనను అరెస్ట్ చేయవద్దంటూ మొండికేశాడు. చివరికి పోలీసు అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.
View this post on Instagram