BCCI : కేవలం దౌత్యపరంగా, సింధూ నది జలాలపరంగా మాత్రమే కాకుండా.. క్రికెట్ పరంగా కూడా భారత్ పాకిస్తాన్ కు నరకం చూపిస్తోంది. జాతీయ మీడియాలో తాజాగా ప్రసారమవుతున్న వార్తల ప్రకారం బీసీసీ త్వరలో నిర్వహించే ఆసియా కప్ ను రద్దు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. భారత్ త్వరలో ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత ఆసియా కప్ నిర్వహిస్తుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇంగ్లాండ్ జట్టుతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశంలో నిర్వహించే ఆసియా కప్ ను బిసిసిఐ రద్దు చేసే దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. ఆసియా కప్ కనుక నిర్వహిస్తే.. భారత్ లో ఆడేందుకు పాకిస్తాన్ వస్తుంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ జట్టుతో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లలో తలపడేది లేదని బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది..
Also Read : శభాష్ హార్దిక్..కంటిపై ఏడు కుట్లు పడినప్పటికీ.. మైదానంలో వీరవిహారం..
రద్దయ్య అవకాశముంది
కేవలం పాకిస్తాన్ మాత్రమే కాకుండా.. ఆసియాలోని ఇతర దేశాలు కూడా ఆసియా కప్ లో తలపడతాయి.. పాకిస్తాన్ చేసిన నిర్వాకం వల్ల ఆసియా కప్ ను రద్దు మాత్రమే కాకుండా.. బంగ్లాదేశ్ పర్యటనను కూడా భారత క్రికెట్ జట్టు రద్దు చేసుకునే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ జట్టుతో భారత్ t20, వన్డే సిరీస్ లు ఆడుతుంది. కానీ ఇప్పుడు ఈ టూర్ ను టీమిండియా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది . పహల్గాం టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో పాకిస్తాన్ తో తలపడేందుకు టీమ్ ఇండియాకు.. సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకునేందుకు అవకాశం ఉండకపోవచ్చు.. అయితే ఆసియా కప్ క్యాన్సిల్ కు సంబంధించి ఇంతవరకు బీసీసీఐ అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే పాకిస్తాన్ జట్టుతో నిర్వహించే క్రికెట్ మ్యాచ్లకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్లే.. ఆసియా కప్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయని తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడే అవకాశం ఉంది. 2023లో పాకిస్తాన్ ఆసియా కప్ నిర్వహించింది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ వెళ్లి ఆడేందుకు ఒప్పుకోలేదు. భారత్ తన మ్యాచ్లను శ్రీలంకలో ఆడింది. చివరికి పాకిస్తాన్ జట్టు కూడా శ్రీలంకలోనే భారత్ తో తలపడింది. ఇక ఈ సిరీస్లో భారత్ ఫైనల్ శ్రీలంక ను మట్టి కరిపించి టైటిల్ సొంతం చేసుకుంది . ఇక ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లోనూ భారత్ పాకిస్తాన్ వెళ్ళలేదు. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ను నేల నాకించి భారత్ ఛాంపియన్ గా నిలిచింది. 2008 తర్వాత పాకిస్తాన్ లో భారత్ ఇంతవరకు పర్యటించలేదు.ఇక ఇప్పుడు పాకిస్తాన్లో భారత్ పర్యటించే అవకాశం ఏమాత్రం లేదు. రెండు దేశాల మధ్య దౌత్య పరంగా సంబంధాలు మెరుగయ్యే అవకాశాలు లేవు.