Pawan Kalyan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దూసుకుపోతున్నారు. ఇన్నాళ్లు ఎవరిని గురించి విమర్శలు చేయని ఆయన ప్రస్తుతం ప్రభుత్వంపైనే ఎదురుదాడికి దిగుతున్నారు. వైసీపీ వర్సెస్ జనసేన అనే తీరుగా పరస్పరం దూషణల పర్వం కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో కుల ప్రస్తావన తెస్తున్నారు. వైసీపీ కుల ప్రాతిపదికగా పాలన సాగిస్తోందని దుయ్యబడుతున్నారు. అందుకే జనసేన రోడ్డు మీదకు వస్తుందని చెబుతున్నారు.

వైసీపీని అడ్డుకోవడంలో టీడీపీకి బలం చాలడం లేదని తెలుస్తోందని పేర్కొంటున్నారు. అందుకే కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలు ఐక్యంగా నిలిచి పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్నాళ్లు అగ్రకులాలే ఆధిపత్యం చెలాయిస్తాయని ప్రశ్నిస్తున్నారు. బీసీలు, ఎస్సీలంతా కలిసి పోరు జరపాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు.
వైసీసీని ఎదుర్కోవడంలో పవన్ కల్యాణ్ ముందు నిలుస్తున్నారు. రాజకీయ సమీకరణల మార్పుకు తెరలేపారు. బీసీ కులాల ఐక్యతపై భరోసా ఇష్తున్నారు. ఇన్నాళ్లు అగ్ర కులాల పెత్తనంలోనే మగ్గిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన అభివృద్ధి కోసం మనమే సరైన దారిలో నడిచే అవకాశం వచ్చింది. దీన్ని అందరు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. కాపులు ఐక్యంగా ఉండాలని సూచిస్తున్నారు. కాపుల ఓట్లతో అధికారం చేపడుతున్న వారు వారికే అవకాశం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఇక సాగదని హెచ్చరిస్తున్నారు.
వైసీపీ ఆగడాలను అడ్డుకునే క్రమంలో అన్ని కులాలు కలిసి రావాలని సూచిస్తున్నారు. కమ్మ, రెడ్డి, క్షత్రియ తదితర ఉన్నత వర్గాలు కూడా అధోగతి పాలవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జనసేన పార్టీ వైపు నడవాలని చెబుతున్నారు. కులం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. కులం పేరుతో దూషిస్తూ ఓట్లు సాధించాలని చూస్తున్నారు.