https://oktelugu.com/

BBC: రక్తం తాగే యూపీ గ్యాంగ్ స్టర్లు మంచోళ్లా.. వారిని చంపడం తప్పా? ఈ ‘బీబీసీ’ని ముందు బొందపెట్టాలి

BBC: ఒక కత్తి తీసుకొని పదిమందిని చంపి, వారి వద్ద ఉన్న డబ్బులు మొత్తం లాక్కొని దారిలో ఉన్న పేదలకు పంచితే.. అటువంటి వ్యక్తిని రాబిన్ హుడ్ అనాలా, రాబిన్ హుడ్ థియరీ మరీ ఇంత దారుణంగా ఉంటుందా? బీబీసీ చెబుతోంది అలాగే ఉంది. మొన్ననే కదా ప్రధాని నరేంద్ర మోదీ మీద ఏవేవో డాక్యుమెంటరీ లు తీసి అభాసుపాలయింది, ఐటీ దాడులు గట్రా ఎదుర్కొంటున్నది.. అయినప్పటికీ ఆ బిబిసి కి బుద్ధి రావడం లేదు..పైగా నెత్తి […]

Written By:
  • Rocky
  • , Updated On : April 18, 2023 5:42 pm
    Follow us on

    BBC

    Atiq Ahmed

    BBC: ఒక కత్తి తీసుకొని పదిమందిని చంపి, వారి వద్ద ఉన్న డబ్బులు మొత్తం లాక్కొని దారిలో ఉన్న పేదలకు పంచితే.. అటువంటి వ్యక్తిని రాబిన్ హుడ్ అనాలా, రాబిన్ హుడ్ థియరీ మరీ ఇంత దారుణంగా ఉంటుందా? బీబీసీ చెబుతోంది అలాగే ఉంది. మొన్ననే కదా ప్రధాని నరేంద్ర మోదీ మీద ఏవేవో డాక్యుమెంటరీ లు తీసి అభాసుపాలయింది, ఐటీ దాడులు గట్రా ఎదుర్కొంటున్నది.. అయినప్పటికీ ఆ బిబిసి కి బుద్ధి రావడం లేదు..పైగా నెత్తి మాసిన రిపోర్టింగ్ లో మరింత ఇజ్జత్ పోగొట్టుకుంటున్నది..ఆ బీబీసీ వెస్ట్రన్ మీడియానే కదా! ఆ రాబిన్ హుడ్ కూడా వెస్ట్రన్ వ్యక్తే కదా! మరి అతడు ఏంటో? అతడి భావజాలం ఏంటో తెలుసు కదా! అలాంటప్పుడు ఈ కొత్త సూత్రీకరణలు దేనికి? అసలు రాబిన్ హుడ్ అనేవాడు జనాల్ని పట్టిపీడిస్తున్న ధనవంతుల్ని చంపి ఆ డబ్బును పేదలకు అందజేశాడు. ఈ ప్రాథమిక సూత్రాన్ని మరిచిపోయిన బీబీసీ మొన్న ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో దుండగుల చేతిలో హతమయిన అతీక్ ఆహ్మద్ ను ఏకంగా రాబిన్ హడ్ ను చేసేసింది.

    వాస్తవానికి పాత్రికేయులకు సమాజం పట్ల నిషితమైన అవగాహన ఉండాలి. అసలు ఏం రాస్తున్నాం అనే సోయి ఉండాలి. అవేవీ పట్టించుకోకుండా, క్షేత్ర స్థాయి పరిస్థితులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా.. చచ్చాడు కాబట్టి బాధితుడు అంటే ఎలా? ఇదేనా బిబిసి రిపోర్టింగ్ అంటే? ఇదేనా వార్తను జనాలకు ఇవ్వడం అంటే? అతీక్ ఆహ్మద్ అనే వాడు ఒక క్రిమినల్, గ్యాంగ్ స్టర్, పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి అక్రమంగా ఆయుధాలు కొనుగోలు చేసినవాడు, అల్ ఖాయిదా వంటి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు నెరిపిన వాడు, కుటుంబాన్ని మొత్తం సంఘవిద్రోహ పనుల్లో దించినవాడు.. ఇలాంటి వాటిని పట్టుకొని బీబీసీ రాబిన్ హుడ్ ను చెయ్యడం ఆ సంస్థ పాత్రికేయ ప్రమాణాలను సభ్య సమాజం ముందు ఉంచుతోంది.

    ఇంకా బిబిసి ఏం చెప్తుందయ్యా అంటే.. అతీక్ అహ్మద్ అనేవాడు త్యాగమూర్తి, పిల్లల చదువుల కోసం డబ్బులు ఖర్చు చేశాడు, ఈద్ పండగ సందర్భంగా బహుమతులు కొనిచ్చాడు, సమాజ హితానికి సంబంధించిన కార్యక్రమాలు చేశాడు, అతడు దుండగులు కాల్పుల్లో చనిపోవడం ఆశ్చర్యకరమే అని రాసుకుంటూ వచ్చింది..కానీ ఇక్కడ బిబిసి విస్మరించిన విషయం ఏంటంటే.. ఉత్తరప్రదేశ్ ను యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన భారతీయ జనతా పార్టీకి చెందినవాడు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీది కూడా భారతీయ జనతా పార్టీ. పైగా వీరికి హిందుత్వ అనే బలం ఉంది. అది బీబీసీకి నచ్చదు. పైగా చనిపోయిన వ్యక్తి ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినవాడు. కాబట్టి బిబిసి ఇలా ఉల్టా పాత్రికేయాన్ని తలకెత్తుకుంది.

    BBC

    Atiq Ahmed

    రాజకీయ నాయకుడిగా మారిన డాన్ అతీక్ అహ్మద్ కరుడుగట్టిన నేరస్థుడు. మాజీ ఎంపీగా, ఎమ్మెల్యే అయిన ఇతడి పై అనేక కేసులు ఉన్నాయి. వందకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ ఇతగాడు చట్టసభలకు ఎంపికయ్యాడు . ఈ విషయాన్ని బీబీసీ దాచి పెట్టింది. అతీక్ అహ్మద్ 40 ఏళ్ళ కిందటే ఒక హత్యాయత్నం కేసులో మొదటిసారి పోలీసు రికార్డుల్లోకి ఎక్కింది. తర్వాత ఐదు సంవత్సరాలకు 1989లో అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అయినప్పటికీ ఇతడి నేరాలు ఏమాత్రం తగ్గు ముఖం పట్టలేదు. 2005లో బహుజన్ సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యే రాజ్ పాల్ హత్య కేసులో అహ్మద్ ప్రధాన నిందితుడు. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్ ఈ ఏడాది ఫిబ్రవరి 24 న హత్యకు గురయ్యాడు. అప్పుడు రాజు పాల్ ను ఎలా అయితే హత్య చేశారో..ఉమేష్ పాల్ ను కూడా అలానే హతమార్చారు.. అంటే అహ్మద్ పగబడితే ఎలా ఉంటుందో శాంపిల్ గా చూపించారు. ఇంతటి దారుణాలు చేస్తే అతీక్ అహ్మద్ బీబీసీ కి రాబిన్ హుడ్ లాగా కనిపించడం నిజంగా ఆశ్చర్యకరం.