Modi HYD Tour హైదరాబాద్ పర్యటనలో 17 ప్రశ్నలతో మోడీకి షాకిచ్చిన టీఆర్ఎస్

Modi HYD Tour సమయం.. సందర్భం చూసి దెబ్బకొట్టడంలో టీఆర్ఎస్ ఆరితేరిపోయింది. ఎక్కడ తెలంగాణలో ఉంటే ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని మోడీని ఆహ్వానించాల్సి వస్తుందని.. సడెన్ గా సీఎం కేసీఆర్ కర్ణాటక టూర్ పెట్టుకొని అక్కడ ముచ్చట్లకు తెరతీశారు. కుమారస్వామి, దేవేగౌడ్ తో జాతీయ రాజకీయ కూటములపై చర్చల పేరుతో వెళ్లిపోయారు. ఇక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ప్రసంగం కోసం ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలోనే మోడీకి హైదరాబాద్ లో నిరసనల […]

Written By: NARESH, Updated On : May 26, 2022 6:22 pm
Follow us on

Modi HYD Tour సమయం.. సందర్భం చూసి దెబ్బకొట్టడంలో టీఆర్ఎస్ ఆరితేరిపోయింది. ఎక్కడ తెలంగాణలో ఉంటే ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని మోడీని ఆహ్వానించాల్సి వస్తుందని.. సడెన్ గా సీఎం కేసీఆర్ కర్ణాటక టూర్ పెట్టుకొని అక్కడ ముచ్చట్లకు తెరతీశారు. కుమారస్వామి, దేవేగౌడ్ తో జాతీయ రాజకీయ కూటములపై చర్చల పేరుతో వెళ్లిపోయారు.

ఇక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ప్రసంగం కోసం ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలోనే మోడీకి హైదరాబాద్ లో నిరసనల స్వాగతాన్ని ఏర్పాటు చేయించింది గులాబీ దండు. బేగం పేట విమానాశ్రయం నుంచి ఐఎస్ బీ వెళ్లే దారిలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి.. మోడీకి కనిపించేలా ప్రదర్శించింది. మోడీకి తెలంగాణకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. మోడీ వెళ్లే దారిలోనే వీటిని ఏర్పాటు చేసి హైదరాబాద్ పర్యటనలో కాస్త గట్టిగానే టీఆర్ఎస్ షాకిచ్చినట్టైంది.

Also Read: Shruti Haasan: చాలా మందితో డేటింగ్ చేశాను… అతను మాత్రం చాలా రేర్‌

హైదరాబాద్ నగరంలో 17 చోట్ల ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధికి సహాయం చేయడంలో ప్రధాని విఫలమయ్యారంటూ ఆ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ఆ ప్లెక్సీలలో నిలదీశారు.

మోడీ పర్యటనను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మోడీ దిగిన బేగంపేట ఎయిర్ పోర్టును ఇప్పటికే ఎస్పీజీ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక ఐఎస్ బీలో మోడీ వ్యతిరేక విద్యార్థులను గుర్తించి వారిని ఐఎస్ బీలోకి అనుమతిని నిరాకరించారు. ఇంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసినా టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో మోడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. వీటిని టీఆర్ఎస్ నే ఏర్పాటు చేయించిందా? లేక మరెవరైనా మోడీ వ్యతిరేకులు ఏర్పాటు చేశారా? అన్నది తేలాల్సి ఉంది.

ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు మాత్రం బీజేపీకి, మోడీని బాగా ఇరుకునపెట్టినట్టైంది.

Also Read: Rahul Gandhi: మరో పెద్ద వివాదంలో చిక్కుకున్న రాహుల్ గాంధీ

Recommende Videos: