Bandla Ganesh: ఒక్క ట్వీట్ తో జీవితా రాజశేఖర్ బండారం బయటపెట్టిన బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ తో కౌంటర్?

Bandla Ganesh: వంద పదాల్లో ఇచ్చే కౌంటర్ ను ఒక్క చిత్రం ఇవ్వొచ్చు అంటారు. అందుకే దృశ్యం అన్నది అతిపెద్ద వెపన్ అయ్యింది.అది చిత్రం కావచ్చు.. ఫొటో కావచ్చు.. ఒక కార్టూన్ కావచ్చు. మనం ఎంత సుధీర్ఘంగా చెప్పాల్సిన అంశాన్ని అయినా ఒకే ఒక చిత్రంతో ఎండగట్టవచ్చు. అలాంటి చిత్రాలకు అంత పవర్ ఉంటుంది. ఇటీవల ఎన్నడూ బయటకు రాని జీవితా రాజశేఖర్ బీజేపీ దీక్షలకు గెస్ట్ గా వచ్చి కేసీఆర్ కాళేశ్వరం అవినీతిపై, కూతురు కవిత […]

Written By: NARESH, Updated On : August 26, 2022 2:07 pm
Follow us on

Bandla Ganesh: వంద పదాల్లో ఇచ్చే కౌంటర్ ను ఒక్క చిత్రం ఇవ్వొచ్చు అంటారు. అందుకే దృశ్యం అన్నది అతిపెద్ద వెపన్ అయ్యింది.అది చిత్రం కావచ్చు.. ఫొటో కావచ్చు.. ఒక కార్టూన్ కావచ్చు. మనం ఎంత సుధీర్ఘంగా చెప్పాల్సిన అంశాన్ని అయినా ఒకే ఒక చిత్రంతో ఎండగట్టవచ్చు. అలాంటి చిత్రాలకు అంత పవర్ ఉంటుంది.

ఇటీవల ఎన్నడూ బయటకు రాని జీవితా రాజశేఖర్ బీజేపీ దీక్షలకు గెస్ట్ గా వచ్చి కేసీఆర్ కాళేశ్వరం అవినీతిపై, కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి, కేటీఆర్ కు హైదరాబాద్ పబ్ లలో వాటాలున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.బీజేపీ సీనియర్లు సైతం చేయనన్న విమర్శలను కేసీఆర్ ఫ్యామిలీపై చేశారు. అయితే జీవితను టీఆర్ఎస్ బ్యాచ్ లైట్ తీసుకుంది. ఎవరూ కౌంటర్ ఇవ్వలేదు.

కానీ బండ్ల గణేష్ కు ఎక్కడ కాలిందో కానీ ఆయన కౌంటర్ ఇచ్చాడు. జీవిత మరీ బండ్ల గణేష్ అభిమానించే పవన్ కళ్యాణ్ సైతం ఏమీ అనలేదు. కానీ ఆయన మాత్రం జీవితపై సంధించిన ఒకే ఒక్క ట్వీట్ ఆమె బండారాన్ని బయటపెట్టింది. ఆమె ఊసరవెళ్లి రాజకీయాలను ఈ చిత్రంతోనే బండ్ల కడిగిపారేశాడు.

ఆ చిత్రం ఉన్నదేంటంటే.. జీవిత రాజశేఖర్ పూటకో డ్రెస్సు మార్చినట్టు పార్టీలను మార్చేసిన చిత్రాలను బండ్ల గణేష్ షేర్ చేశాడు. మొదట చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న జీవిత రాజశేఖర్ ఫొటో పోస్ట్ చేశాడు. అనంతరం వైఎస్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరింది.. ఆ తర్వాత గత ఎన్నికల వేళ జగన్ ను కలిసి వైసీపీలో చేరింది.. ప్రస్తుతం తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న నాలుగు ఫొటోను బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు.

ఎప్పుడు ఏ పార్టీలో కుదురుగా ఉండని జీవితా రాజశేఖర్ లు ఇప్పుడు చేస్తున్న ఆరోపణలను ఎద్దేవా చేస్తూ.. విశ్వసనీయత లేని వీళ్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎన్టీవీని ట్యాగ్ చేస్తూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు.

అయితే బండ్లకు కౌంటర్ గా కొందరు ఆయన అభిమానించే పవన్ కళ్యాణ్ మొదట ప్రజారాజ్యాంను గెలిపించమని.. తర్వాత టీడీపీ-బీజేపీని, 2018లో బీఎస్పీని, ఇప్పుడు బీజేపీని గెలిపించమంటున్నారని కౌంటర్ గా ఫొటోలు పెట్టి కడిగేస్తున్నారు. మీ బాస్ చేయగా లేనిది జీవిత రాజశేఖర్ చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.