https://oktelugu.com/

Bandla Ganesh: బండ్ల గణేష్ కే మైండ్ బ్లాంక్ చేసిన జగన్

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలు జరుగుతుండడంతో బండ్ల గణేష్ యాక్టివ్ అయ్యారు. ఎక్కడ నుంచి పోటీకి దిగకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం, గెలుపు కోసం తనవంతు పాత్ర పోషిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 14, 2023 / 02:36 PM IST

    Bandla Ganesh

    Follow us on

    Bandla Ganesh: బండ్ల గణేష్ ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్ గా, నటుడిగా, నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో సైతం క్రియాశీలక పాత్ర పోషించారు. వీటన్నింటికీ మించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరభక్తుడిగా గుర్తింపు పొందారు. సినీ రంగంలో విమర్శలకు దూరంగా ఉండే బండ్ల గణేష్.. రాజకీయాల్లో మాత్రం సంచలనం గా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. టీవీ డిబేట్ లలో వివాదాలు పెట్టుకున్న సందర్భాలు కూడా అధికం. నిజాలను నిర్భయంగా ఒప్పుకోవడం కూడా ఆయన నైజం.

    ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలు జరుగుతుండడంతో బండ్ల గణేష్ యాక్టివ్ అయ్యారు. ఎక్కడ నుంచి పోటీకి దిగకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం, గెలుపు కోసం తనవంతు పాత్ర పోషిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, డిసెంబర్ 9న కాంగ్రెస్ నేత ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారని.. రెండు రోజులు ముందే తాను దుప్పటి తీసుకొని అక్కడ పడుకుంటానని కూడా తేల్చి చెప్పారు.గత ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ గెలవకుంటే బ్లేడుతో మెడ కోసుకుంటానని కూడా తేల్చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడంతో బ్లేడు గణేష్ అన్న అని ముద్ర పడిపోయారు. ఇప్పుడు కూడా ఆయన చేసిన దుప్పటి కామెంట్స్ వైరల్ అవుతోంది.

    తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీవీ5 ప్రత్యేక ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ పాల్గొన్నారు. తన అభిప్రాయాలను పంచుకున్నారు. గత ఎన్నికల్లో తన అంచనాలు తప్పాయని.. అందుకు గల కారణాలను సైతం వివరించారు. ఈ క్రమంలో ఏపీ విషయం ప్రస్తావనకు వచ్చింది. వైసిపి అంతలా ప్రభంజనం చూపుతుందని తనకు తెలియదని.. ఏపీలో ఉన్న తన సన్నిహితులకు ఫోన్ చేస్తే వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పారని.. చివరకు మంగళగిరిలో లోకేష్ సైతం ఓడిపోతున్న విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. కానీ తాను నమ్మలేదని.. ఎప్పుడైతే వైసీపీకి 151 యొక్క స్థానాలు రావడంతో తన మైండ్ బ్లాక్ అయ్యిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో బ్లేడ్ కు మించి ఎఫెక్ట్ చూపిందని బండ్ల గణేష్ చెప్పడం విశేషం.