Bandi Sanjay: తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటీ వాతావరణం నెలకొంది. బీజేపీని టార్గెట్ చేసుకుని సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు విషయంలో రాద్ధాంతం చేస్తున్నారు. దీంతో బీజేపీ కూడా టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర చేస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు .గడీల పాలన అంతమొందిస్తామని చెబుుతున్నారు. కుటుంబ పాలన తుద ముట్టిస్తామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చప్పారు.

నిన్న మహబూబ్ నగర్ జోగులాంబ దేవాలయం నుంచి ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడత ప్రచారం షురూ చేశారు. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ ను జైలుకు పంపుతామని సవాల్ చేశారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు.
Also Read: Power Cuts In Telangana: కేసీఆర్ సార్.. ఇలా ‘కరెంట్’ షాకిస్తాడని అనుకోలేదు..!
బీజేపీ అధికారంలోకి వస్తే హిందువులకు మంచి రోజులొస్తాని పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, దళితుడికి సీఎం పదవి, ప్రతి ఏడాది ఉద్యోగాల నియామకాలు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామంటూ హామీలిచ్చి ఇప్పుడు నేను అనలేదని చెబుతున్నారు. అందుకే కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడినట్లే.
మైనార్టీల మీద ఎందుకంత ప్రేమ. బీజేపీ మతతత్వ పార్టీ అయితే ఎంఐఎం నీ ఇంటి పార్టీ నా అని ప్రశ్నించారు. ఎంఐఎంతో దోస్తీ చేస్తూ ఇతరులను మత చాందసవాదులుగా చిత్రీకరిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. రంజాన్ కు ముస్లింలకు నమాజ్ చేసుకునే వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం ఆంజనేయ, అయ్యప్ప, శివ భక్తులకు ఎందుకు సహకరించడం లేదు. ఎందుకంటే వారి మీద ప్రేమ మన వారి మీద ఏముందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలని చూస్తున్న బీజేపీ త్వరలోనే ఆ కోరిక తీర్చుకోబోతోంది. ఇందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసే పాదయాత్రతో ప్రజల్లోని అవసరాలు తెలుసుకుని వారి సమస్యలు తీర్చాలని చూస్తున్నారు. అన్ని వర్గాలను బీజేపీ దగ్గర తీసుకుంటుంది. వారి అభ్యున్నతికి పాడుపడుతుంది. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను మట్టి కరిపించాలని ప్రజలను కోరుతున్నారు.
బీజేపీ చేపట్టిన పాదయాత్రతో రాష్ట్ర భవిష్యత్ మారబోతోంది. గడీల పాలనకు చరమగీతం పాడనున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి పెద్ద ఎత్తున జరిగింది. దానిపై విచారణ జరిపించి బాధ్యులై చర్యలు తీసుకునేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.
[…] Relationships: శృంగారం బంగారంతో సమానం అంటారు. అంటే అంత పవిత్రంగా చూసుకోవాలనేది దాని సారాంశం. కానీ ఇటీవల కాలంలో శృంగారం విచ్చలవిడి ప్రక్రియగా మారిపోతోంది. మనిషి జంతువు నుంచి వచ్చాడనే నానుడినే నిజం చేస్తూ పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. అసలు దానికి విలులే లేకుండా చేస్తున్నారు. పూర్వం రోజుల్లో శృంగారమంటే గుట్టుగా సాగే వ్యవహారంగా మాత్రమే పరిగణించేవారు. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు శృంగారం కూడా హద్దులు దాటుతోంది. […]