https://oktelugu.com/

Bandi Sanjay: బండి సంజయ్ ని ఇంత పకడ్బందీగా ఇరికించారా? జైల్లో ప్రాణాలకు విషాహారం ముప్పు?

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాటకీయ పరిణామాల మధ్య ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి బండి సంజయ్ ను కోర్టులో బుక్ చేశారని ఆయన తరుఫున లాయర్లు ఆరోపిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీ కేటాయింపులపై జీవో 317ను వ్యతిరేకిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘జాగరణ దీక్ష’ చేపట్టిన సంగతి తెలిసిందే. దీన్ని నిన్న రాత్రి భగ్నం చేసిన […]

Written By:
  • NARESH
  • , Updated On : January 3, 2022 / 08:28 PM IST
    Follow us on

    Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాటకీయ పరిణామాల మధ్య ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి బండి సంజయ్ ను కోర్టులో బుక్ చేశారని ఆయన తరుఫున లాయర్లు ఆరోపిస్తున్నారు.

    ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీ కేటాయింపులపై జీవో 317ను వ్యతిరేకిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘జాగరణ దీక్ష’ చేపట్టిన సంగతి తెలిసిందే. దీన్ని నిన్న రాత్రి భగ్నం చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టాల్సిన పోలీసులు ‘ఎక్సైజ్ కోర్టు’లో బండి సంజయ్ ను ప్రవేశపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.

    బండి సంజయ్ బెయిల్ కోసం అంతా సిద్ధం చేసిన లాయర్లకు కోర్టును మార్చడంతో ఖంగుతిన్నారు. ఎక్సైజ్ కోర్టు బండి బెయిల్ పిటీషన్ ను కొట్టేసి ఏకంగా 14 రోజుల రిమాండ్ విధించడం సంచలనమైంది. దీంతో లాయర్లు హుటాహుటిన హైకోర్టులో బెయిల్ పిటీషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.

    పోలీసులు ఇచ్చిన షాక్ తర్వాత లాయర్లు కోర్టులో గట్టిగా వాధించారు. బండి సంజయ్ కు జైలులో విష ప్రయోగం జరిగే ఛాన్సుందని.. ఆయనకు అందించే ఆహారాన్ని జైలర్ రుచి చూశాకే ఇవ్వాలని కోర్టును కోరారు. దీనికి కోర్టు అంగీకరించింది. బండి ఆహారాన్ని పరీక్షించాకే పెట్టాలని సూచించింది.

    ఇక ఒక ఎంపీని, ఒక పార్టీ అధ్యక్షుడికి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దారుణమని ఆయన తరుఫున లాయర్లు మండిపడ్డారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళతామన్నారు. మొత్తంగా ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే బండి సంజయ్ ను కావాలనే పకడ్బందీగా జైలుకు పంపినట్టు అర్థమవుతోంది.