BJP 2023 plan: తెలంగాణలో 2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతోంది. ఇందుకోసం కమలదళం వ్యూహాలు ఖరారు చేస్తోంది. టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకం చేయాలని భావిస్తోంది. దీని కోసం నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే క్రమంలో అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలో నిలపాలని యోచిస్తోంది.

చిన్న పార్టీలను సైతం తనలో కలుపుకుని పోరాటం చేయాలని చూస్తోంది. దీని కోసం ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో బీజేపీలో జోష్ పెరిగింది. నాయకత్వం అధికారం కోసం పనిచేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తెలంాణ ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలను సైతం అక్కున చేర్చుకోవాలని చూస్తోంది.దీని కోసం ఓ కార్యాచరణ ప్రణాళిక రచిస్తోంది.
Also Read: బీజేపీలోకి మరో ఉద్యమ నేత.. తెరవెనుక ఉన్నదెవరు?
తెలంగాణలో పార్టీ పుంజుకుంటుందని తెలుసుకున్న నేపథ్యంలో కార్యకర్తలను పెంచుకుని అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో మొదటి దశ పాదయాత్ర పూర్తి చేశారు. ఇప్పుడు రెండో దశ కోసం ప్లాన్ చేస్తున్నారు. దీంతో అధికార పార్టీకి ఓటమి తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. దీంతోనే కేసీఆర్ బీజేపీపై మండిపడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ వ్యతిరేకత ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పరాభవం తప్పదేమోననే ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం ఏ అడ్డదారులు తొక్కుతుందో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. అయితే కేసీఆర్ మాటలు నమ్మేందుకు ఎవరు సిద్ధంగా లేరనే విషయం తెలిసిపోతోంది. ఇప్పటికే ఎన్నో వాగ్దానాలు చేసి తరువాత నేను అనలేదని తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మాత్రం అపజయం తథ్యమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ ప్రస్థానం ప్రశ్నార్థకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: కేసీఆర్ టార్గెట్ బీజేపీ.. అసలు కారణం ఇదేనా?