Bandi Sanjay Padayatra: బండి సంజయ్.. గతంలో ఉన్న బీజేపీ అధ్యక్షుల కంటే చాలా ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. గతంలో ఉన్న అధ్యక్షులు పార్టీ పగ్గాలను చేపట్టిన తర్వాత నుంచి విడిచిపెట్టే వరకు తమ ప్రభావాన్ని పార్టీలో పెద్దగా చూపించలేకపోయారు. కానీ బండి సంజయ్ మాత్రం తన మార్కు రాజకీయాలతో పార్టీని తన గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా గతంలో తొలివిడత ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఏప్రిల్ 14 నుండి ఈ యాత్రను చేపట్టబోతున్నారు. ఎలాగూ ఎలక్షన్లకు సమయం దగ్గర పడుతుండటంతో వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తొలివిడతలో 36 రోజులు పాదయాత్ర చేసిన సంజయ్.. ఈసారి దాదాపు 200 రోజులు పాదయాత్ర చేసేలా వ్యూహం రచిస్తున్నారు. ఈ రెండో విడత పాదయాత్రను జోగులాంబ జిల్లా నుండి భద్రాచలం శ్రీ రాములవారి ఆలయం వరకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: జాతీయ రాజకీయాలపై ‘కేసీఆర్’ అసలు ప్లాన్ ఇదే!
బీజేపీ స్ట్రాటజీ ప్రకారం ఈ పాదయాత్రలో కూడా గుడుల సెంటిమెంటును వినియోగిస్తున్నారు. గతంలో కూడా చార్మినార్ దగ్గర వుండే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద తొలివిడత పాద యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం అన్ని రకాలుగా పార్టీ తరపున కూడా వ్యూహాలు రచిస్తున్నారు.
2 రోజుల క్రితం బండి సంజయ్ పార్టీ ఆఫీస్ లో బీజేపీ అసమ్మతి నేతలతో భేటీ అయ్యారు. తన పాదయాత్ర కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పార్టీ తరఫున ఫుల్ సపోర్ట్ వచ్చేలా దిశానిర్దేశం చేశారు. అసమ్మతి నేతలను పార్టీ లైన్ దాటకుండా హెచ్చరించారు. దీంతో వారు కూడా పార్టీ ఆదేశాలను ధిక్కరించబోమంటూ హామీ ఇచ్చారంట. వీటన్నిటినీ చూస్తుంటే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను సంజయ్ బాగానే వాడుతున్నారని అంటున్నారు నిపుణులు. అధ్యక్ష పదవి ఉన్నప్పుడే తన పట్టును పార్టీలో నిలుపుకోవాలని చూస్తున్నారు. అటు ప్రజల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా తనమీద పాజిటివ్ వేవ్ వుండేలా చూసుకుంటున్నారు. తనను తాను ఒక జిల్లాకు చెందిన నాయకుడుగా కాకుండా రాష్ట్ర నేతగా మార్చుకునేలా చూసుకుంటున్నారు.
చూస్తుంటే బీజేపీలో తాను అధ్యక్షుడిగా లేకపోయినా కూడా తన మాట చెల్లుబాటు అయ్యే విధంగా బండి సంజయ్ ఇప్పటినుండే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఏ అధ్యక్షుడికి కూడా దక్కనంత క్రేజ్ బండి సంజయ్ కి దక్కింది. ఈ పాదయాత్ర తో సంజయ్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తారా లేదా అన్నది వేచి చూడాలి.
Also Read: పార్టీ గెలిస్తే తొలి సంతకం దాని మీదే అంటున్న రేవంత్.. కాంగ్రెస్‌లో అగ్గి రాజుకుంటుందా..?
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Bandi sanjay preparing for the second installment of the padayatra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com