Bandi Sanjay Arrested: ఢిల్లీలో బయటపడ్డ లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవితకు సంబంధాలున్నాయని బీజేపీ ఎంపీలు ఇలా ఆరోపించడం.. తెలంగాణ బీజేపీ నేతలు ఇలా అందిపుచ్చుకొని రచ్చచేయడం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి ఎదుట బీజేపీ నేతలు నిన్న పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో సీరియస్ అయిన కేసీఆర్ సర్కార్ వెంటనే పోలీసులతో అరెస్ట్ చేయించి వారిపై ఏకంగా ‘హత్యాయత్నం’ లాంటి కఠిన సెక్షన్లు పెట్టి జైలుకు పంపింది. మామూలు నిరసనకు అంతపెద్ద శిక్షలు విధించడంపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. దీనికి నిరసనగా జనగామ జిల్లాలో తాను పాదయాత్ర చేస్తున్న పామ్మూర్ పాదయాత్ర శిబిరం వద్ద దీక్ష తలపెట్టారు.
ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాంకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన బీజేపీ కార్యకర్తలను విడుదల చేయాలని.. . కేసులు ఉపసంహరించాలని బండి సంజయ్ దీక్ష చేపట్టడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ దీక్ష ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అయితే బండి సంజయ్ వద్దకు పోలీసులు చేరకుండా బీజేపీ శ్రేణులంతా ఒక కోటలాగా మారడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Also Read: BJP vs AAP: ఆ పత్రిక కథనంతోనే బిజెపి, ఆప్ డిష్యుం డిష్యుం
పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో వందలాది మంది పోలీసులు వచ్చి బండి సంజయ్ ను బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకొని తీవ్ర ప్రతిఘటన చేశారు. పోలీసుల వాహనాలు కదలకుండా భైటాయించారు.
ఉద్రిక్తంగా పరిస్థితులు మారడంతో పోలీసులు లాఠీచార్జిలు చేస్తూ పక్కకు తొలగించి బండి సంజయ్ ను అరెస్ట్ చేసి పట్టుకెళ్లారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
బండి సంజయ్ ను అరెస్ట్ చేసి కరీంనగర్ కు తరలిస్తున్నట్టు తెలిసింది. పోలీసులు పెద్ద ఎత్తున బండిని అత్యంత రక్షణ వలయంలో అరెస్ట్ చేసి తీసుకెళుతున్నారు. ఇక బండి సంజయ్ అరెస్ట్ విషయం తెలియగానే కేంద్రంలోని పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలు ఫోన్ చేసి సంజయ్ తో మాట్లాడినట్టు తెలిసింది. బండిని విడిపించేందుకు ఏకంగా కేంద్ర మంత్రులు రంగంలోకి దిగబోతున్నారని..టీఆర్ఎస్ సర్కార్ తో ఫైట్ ను మరింతగా ముదిరేలా చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఒక్క అవినీతి ఆరోపణల లేదని.. ఈడీనా..? బోడీనా అని కేసీఆర్ అన్న రెండు రోజులకే ఆయన కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో పేరు రావడంతో టీఆర్ఎస్ ఇరుకునపడింది. దీన్ని బీజేపీ ఎలుగెత్తి చాటుతుండడంతో టీఆర్ఎస్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ప్రతిష్ట మసకబారకుండా బండి సంజయ్ ను సైతం అరెస్ట్ చేసింది. కానీ బీజేపీ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవుతోంది.
Also Read:Jagan Delhi Tour: జగన్ ఢిల్లీ ఎందుకెళ్లినట్టు? ఎందుకొచ్చినట్టు?