https://oktelugu.com/

బండి సంజయ్‌.. వీటికి సమాధానాలు చెప్పు: హరీష్ రావు

దుబ్బాక బైపోల్‌ సందర్భంగా బీజేపీ, మంత్రి హరీష్‌ రావు మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. మంత్రిని బీజేపీ టార్గెట్‌ చేయగా.. మంత్రి హరీష్‌ కూడా అదే స్థాయిలో కౌంటర్‌‌ ఇస్తున్నారు. సవాల్‌కు ప్రతిసవాల్‌ విసురుతున్నారు. తాజాగా.. హరీష్‌ కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం చేసిందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌‌కు 18 ప్రశ్నలతో కూడిన లేఖ రాశారు. వాటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2020 / 02:40 PM IST
    Follow us on

    దుబ్బాక బైపోల్‌ సందర్భంగా బీజేపీ, మంత్రి హరీష్‌ రావు మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. మంత్రిని బీజేపీ టార్గెట్‌ చేయగా.. మంత్రి హరీష్‌ కూడా అదే స్థాయిలో కౌంటర్‌‌ ఇస్తున్నారు. సవాల్‌కు ప్రతిసవాల్‌ విసురుతున్నారు. తాజాగా.. హరీష్‌ కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం చేసిందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌‌కు 18 ప్రశ్నలతో కూడిన లేఖ రాశారు. వాటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    అవి ఏంటంటే.. తెలంగాణ రాగానే ఏడు మండలాలను ఆంధ్రాకు అప్పజెప్పింది బీజేపీ ప్రభుత్వం కాదా..? అతి తక్కువకు విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే లోయర్‌‌ సీలేరు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్రాన్ని ఎవరు అప్పగించారు..? విభజనం చట్టం ప్రకారం బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ పెట్టకుండా మోసం చేయలేదా..? యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఐటీఐఆర్‌‌ ప్రాజెక్ఉటను బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఉపసంహరించుకుంది..? కాజీపేటలో వ్యాగన్‌ ఫ్యాక్టరీని రద్దుచేసింది బీజేపీ కాదా..? రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లు గడిచినా తెలంగాణ న్యాయమైన నీటి పంపకాలు చేయకుండా అన్యాయం చేస్తోంది బీజేపీ కాదా..? ఆంధ్రాకు దేశంలోని అనేక ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు..?

    Also Read: దేశంలోనే ఏపీకి అత్యంత అన్యాయం: జగన్

    తెలంగాణ ఏర్పడినా ఆంధ్రా విద్యుత్‌ ఉద్యోగులు 1153 మంది ఇంకా ఇక్కడే పనిచేస్తున్నారు. దీని వల్ల ఏటా రూ.1000 కోట్ల భారం పడుతోంది. ఆంధ్రా ఉద్యోగులను పంపకుండా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు..? తెలంగాణలో 39.5 లక్షల మందికి 2,016 రూపాయల పింఛన్‌ ఇస్తుంటే.. కేంద్రం ఎందుకు 6 లక్షల మందికి రూ.200 పెన్షన్ ఇస్తోంది..? దేశవ్యాప్తంగా 100 విమానాశ్రయాలు కడుతుంటే.. అందులో తెలంగాణకు ఎందుకు అవకాశం లేదు..? వరంగల్‌ మామునూర్‌‌లో నిజాం హయాంలోనే విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తయింది. దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్‌ రంగ అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ.. ప్యాకేజీలు ఇస్తున్న కేంద్రం వరంగల్‌లో నిర్మిస్తున్న దేశంలోని అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్కుకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదు..?

    Also Read: ప్రైవేట్ పాఠశాలలకు జగన్ సర్కార్ షాక్.. టీసీ లేకుండానే…?

    ఆదిలాబాద్‌లో గెలిస్తే సీసీఐని తిరిగి తెరుస్త అని అన్నారు. కానీ.. అక్కడ గెలిచి రెండేళ్లు గడుస్తున్నా ఎందుకు తెరవలేదు..? ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ తీర్మానం చేసినా.. కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు..? తెలంగాణకు మొత్తం రావాల్సిన రూ.12 వేల కోట్లు ఇవ్వకుండా వివక్ష ప్రదర్శించడం లేదా..? అని హరీష్‌ ప్రశ్నించారు. మరి.. హరీష్‌ సంధించిన ఈ ప్రశ్నలకు సంజయ్‌ ఎప్పుడు సమాధానం ఇస్తారో ఆసక్తిగా ఉంది.