తమిళనాడులో పట్టుబడిన వాహనంలో రూ.5.25 కోట్లు ఉండటం, ఆ వాహనానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించి ఉండటం రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తమిళనాడు రిజిష్ట్రేషన్ తో ఉన్న ఈ పాట్చూనర్ వాహనం డ్రైవర్ ఒంగోలుకు చెందిన వ్యక్తి, అతనితోపాటు వాహనంలో మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. తొలుత తమిళనాడు మీడియా రాష్ట్ర మంత్రి బాలినేనికి చెందిన డబ్బును తరలిస్తున్నట్లు ప్రచారం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడింది. ముఖ్యమంత్రి జగన్ అవినీతికి దూరంగా ఉండాలని మంత్రులు ఎమ్మెల్యేలకు పదే పదే సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం ఆ పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తుంది.
టీడీపీ మరో స్కాం వెలుగులోకి.. మాజీ మంత్రి బుక్
ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడటంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ డబ్బు ఎవరిదనే అంశంపై తమిళనాడు అరంబక్కం పోలీసులు ఆరా తీస్తున్నారు. కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు డబ్బుతోపాటు ప్రయాణిస్తుండగా పోలీసులు తనిఖీల సందర్భంగా ఇద్దరు వ్యక్తులు తప్పించుకుని పరారవగా, మరో ముగ్గురు మాత్రమే పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. హవాలా విధానంలో తరలిస్తున్నారా లేక నల్లధనమా అనే అంశంపైనా దృష్టి సారించారు. వాహనం ప్రకాశం జిల్లా వైపు నుంచి తమిళనాడు రాష్ట్రానికి వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలో ఒ బంగారు వ్యాపారి ఇళ్ళలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ వ్యాపారికి చెందిన సోమ్మును తరలించేందుకు మంత్రి పేరు వినియోగించుకున్నారనే వాధన ఉంది. మరోవైపు కారులో నుంచి పరారైన వారిలో రాజకీయ నాయకుడి తనయుడు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
డబ్బు పట్టుబడిన సంఘటన జరిగిన అనంతరం మంత్రి బాలినేని శ్రీనివాసరావు మీడియాకు ఓ వీడియోను విడదల చేశారు. తమిళనాడులో పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు తనది కాదని స్పష్టం చేశారు. కారు డ్రైవర్ ఒంగోలుకు చెందిన వ్యక్తి కావడం, ఎమ్మెల్యేగా తన పేరుతో ఉన్న స్టిక్కర్ ను వినియోగించడంతో తనదిగా పోలీసులు భావించారని తెలిపారు. ఈ ఘటనపై వాస్తవాలు తెలిసేందుకు పోలీసులు అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. స్టిక్కర్ ఫోటో జిరాక్స్ తో ఉందని చెప్పారు. వాహనం తమిళనాడు రాష్ట్రానికి చెందినదేనని పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి బాధ్యుతలను కఠినంగా శిక్షించాలని కోరారు.