
Balakrishna: సినీ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన మనసులోని మాట బయటపెట్టారు. ఓ షోకు హోస్ట్ గా వచ్చిన ఆయనకు ఓ ప్రశ్న ఉక్కిరిబిక్కిరి చేసింది. తెలుగుదేశం పార్టీకి మీరు ఎందుకు నాయకత్వం వహించలేదనే ప్రశ్న ఆయనను ఇబ్బంది పెట్టింది. అయినా చతురతతో సమాధానం చెప్పారు. బాలకృష్ణకు ఎధురైన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబిచ్చారు. దీంతో అందరు ఆశ్చర్యపోయారు.
ఈ సందర్భంగా మరో నటుడు మోహన్ బాబు బాలకృష్ణ(Balakrishna)ను పలు ప్రశ్నలు అడిగారు. తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టకపోవడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. దీనిపై బాలయ్య స్పందిస్తూ ఓపిగ్గా సమాధానం చెప్పారు. నాకు రాజకీయాలంటే అప్పట్లో అంత ఆసక్తి లేకపోవడంతో చంద్రబాబు నాయకత్వానికే ఓటు వేసినట్లు పేర్కొన్నారు. పైగా సినిమాలతో బిజీగా ఉండే తాను రాజకీయాల్లోకి రావడం అప్పట్లో కరెక్టు కాదనిపించింది. అందుకే పార్టీ పగ్గాలు తీసుకోవడానికి వెనకడుగు వేశానన్నారు.
మోహన్ బాబుకు కూడా ఓ ప్రశ్న ఎదురైంది. మీరు నటించిన సినిమాల్లో బాగా నష్టం కలిగించింది ఏది? అని అడగ్గా పటాలం పాండు అని జవాబిచ్చారు. ఆ సినిమాతో చాలా నష్టపోయానన్నారు. మహాబలిపురంలో తనకున్న భూములను అమ్మి అప్పులు తీర్చానన్నారు. తరువాత కాలంలో అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ, పెదరాయుడు వంటి వరుస విజయాలతో కోలుకున్నట్లు చెప్పారు.
రాజకీయాల్లో పూర్తిస్థాయి నిలబడాలంటే కష్టమే. ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలు చేయడం కుదరదు. అందుకే పార్టీ పగ్దాలు తీసుకోవడానికి ముందుకు రాలేకపోయా. పైగా అన్నింట్లో ఆరితేరిన నేతగా చంద్రబాబు ఉండటంతోనే తమకు ఆ అవకాశం రాలేదని చెప్పారు. దీంతో తన బావపై ఉన్న సంబంధంపై తనదైన శైలిలో జవాబిచ్చారు.
Also Read: బాలక్రిష్ణ, మోహన్ బాబు ఏ బ్రాండ్ మద్యం తాగుతారో తెలుసా?