Nandamuri Family: ఏపీలో జరుగుతున్న రాజకీయ రచ్చ నేపథ్యంలో తెర పైకి బలవంతంగా రావాల్సి వచ్చింది జూనియర్ ఎన్టీఆర్. ఇష్టం లేకపోయినా ఒక వీడియోలో ఏదో బాబు పై నాలుగు సింపతీ డైలాగ్ లు పలకాల్సి వచ్చింది. అయితే, బాబు కన్నీళ్లు చూసి కూడా ఎన్టీఆర్ స్పందించిన తీరు బాగాలేదు అనేది టీడీపీ అభిమానుల ఆక్రోశం. మరోపక్క నందమూరి కుటుంబ సభ్యులకు కూడా ఇది సంతృప్తి నివ్వలేదని తెలుస్తోంది.

ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా బాబు పేరు కూడా లేకపోవడం బాలయ్యకి నచ్చలేదు. అందుకే, బాలయ్య అభిమానులు కూడా ఎన్టీఆర్ ను ఇప్పుడు టార్గెట్ చేశారు. తన స్పీచ్ పై మిశ్రమ స్పందన వచ్చిన సంగతి ఎన్టీఆర్ అర్ధం అయింది. అందుకే, ఈ టాపిక్ ను సాధ్యమైనంత త్వరగా డైవర్ట్ చేయాలని ఎన్టీఆర్ ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నాడు.
Also Read: చంద్రబాబు కన్నీళ్లు.. జూ.ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన టీడీపీ!
నిజానికి ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి నిన్న తన పెద్ద కుమారుడు అభయ్ రామ్ తో కలిసి దిగిన పిక్ ను పోస్ట్ చేశాడు. పిక్ అయితే, బాగా వైరల్ అయింది కానీ, టాపిక్ మాత్రం పక్కదారి పట్టలేదు. పైగా బాబు, టీడీపీ అభిమానులు కన్నీళ్లతో బాధ పడుతూ ఉంటే.. ఎన్టీఆర్ ఇలా తన కొడుకుతో సరదాగా గడుపుతూ పైగా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడం ఏ మాత్రం బాగాలేదు అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.
అయినా నందమూరి కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించిన ప్రెస్ మీట్ కు జూనియర్ ఎన్టీఆర్ ను అసలు ఎందుకు పిలవలేదు ? పిలిచి ఉంటే జూనియర్ వచ్చేవాడు. ఒకవేళ రాకపోయి ఉంటే.. వ్యవహారం మరోలా ఉండేది. కానీ, అసలు ఎన్టీఆర్ ను పిలవకుండా… ఫ్యామిలీ మొత్తం ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంది. అంటే… ఎన్టీఆర్ తమ ఫ్యామిలీ కాదు అని బాలయ్య చెప్పాలనుకున్నారా ?
Also Read: టీడీపీ వైపు జూనియర్ ఎన్టీఆర్ వస్తారా? రారా?
అయినా ఎన్టీఆర్ అభిమానుల మనసును అర్థం చేసుకుని మొత్తానికి ఒక వీడియో బైట్ రిలీజ్ చేస్తూ చిన్న స్పీచ్ ఇచ్చాడు. నిన్న అసెంబ్లీ లో జరిగిన సంఘటన తనకు ఎంతగానో బాధ కలిగించిందని తారక్ చెప్పుకొచ్చాడు. మరి తారక్ కి నిజంగానే బాధను కలిగించిందా ? లేక, ఏదో సెంటిమెంట్ ను పండించే ప్రయత్నం చేశాడా ? అనేది ఎన్టీఆర్ కే తెలియాలి.