Homeఎంటర్టైన్మెంట్Shayam Singaroy: నాని "శ్యామ్ సింగరాయ్" నుంచి రెండో పాట ఎప్పుడంటే...

Shayam Singaroy: నాని “శ్యామ్ సింగరాయ్” నుంచి రెండో పాట ఎప్పుడంటే…

Shayam Singaroy: నాని ప్రస్తుతం ” శ్యామ్‌ సింగరాయ్‌ ” అనే సినిమాలో నటిస్తున్నాడు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటివరకు ఎమోషనల్, కామెడీ సినిమాలు ఎక్కువగా చేసిన త్వరలోనే పూర్తిస్థాయి యాక్షన్‌ సినిమాతో రాబోతున్నాడు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా దాదాపు షూటింగ్‌ పూర్తి చేసేకుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది.

secomd song release date announcement by shyam singaroy movie team

ఈ సినిమా లోని రెండో పాట “ఏదో ఏదో” ను నవంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సాంగ్ లో కృతి శెట్టి తో నాని స్టెప్పులేయనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ చెయ్యగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ నాని కెరీర్‌లో ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతోంది. రీసెంట్‌గా హిందీ శాటిలైట్ రైట్స్ భారీ రేటుకి అమ్ముడుపోయాయి. బీ 4 ఛానెల్ రూ. 10 కోట్లకు ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ హిందీ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 24న తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషల్లో ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

చాలా కాలంగా సాలిడ్​ హిట్​కోసం ఎదురుచూస్తున్న నానికి ఈ సినిమా బ్రేక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ మూవీని  నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular