https://oktelugu.com/

Balakrishna: బాలయ్య సంచలనం.. రాజీనామా సవాల్.. వైసీపీ రెడీనా?

Balakrishna: ఏపీలో కొత్త జిల్లాల ఉద్యమం కొత్త రూపు సంతరించుకుంది. కొత్త జిల్లాల ప్రకటనతో వైసీపీలో హర్షం వ్యక్తం అవుతుండగా.. టీడీపీ నేతలు గుంబనంగా ఉంటున్నారు. అనేక ప్రాంతాల్లో కొత్త జిల్లాల ప్రకటన ఆందోళనకు కారణమైంది. హిందూపూర్ కేంద్రంగా కొత్త జిల్లా ఉద్యమం మొదలైంది. లీడ్ చేసేది ఎవరో కాదు.. మన నటసింహం బాలయ్య బాబు.. సినిమాల్లోలాగేనే బయట కూడా ‘ఫైర్’ అని చూపిస్తున్నాడు. తాజాగా మౌనదీక్షతో కొత్త జిల్లా ఉద్యమాన్ని రగిలించాడు. రాజీనామా ప్రకటన చేసి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 4, 2022 / 02:36 PM IST
    Follow us on

    Balakrishna: ఏపీలో కొత్త జిల్లాల ఉద్యమం కొత్త రూపు సంతరించుకుంది. కొత్త జిల్లాల ప్రకటనతో వైసీపీలో హర్షం వ్యక్తం అవుతుండగా.. టీడీపీ నేతలు గుంబనంగా ఉంటున్నారు. అనేక ప్రాంతాల్లో కొత్త జిల్లాల ప్రకటన ఆందోళనకు కారణమైంది. హిందూపూర్ కేంద్రంగా కొత్త జిల్లా ఉద్యమం మొదలైంది. లీడ్ చేసేది ఎవరో కాదు.. మన నటసింహం బాలయ్య బాబు.. సినిమాల్లోలాగేనే బయట కూడా ‘ఫైర్’ అని చూపిస్తున్నాడు. తాజాగా మౌనదీక్షతో కొత్త జిల్లా ఉద్యమాన్ని రగిలించాడు. రాజీనామా ప్రకటన చేసి షాక్ ఇచ్చాడు.

    కొత్త జిల్లాల ప్రకటన అనంతపురం జిల్లా హిందూపూర్ లోనూ నిరసనలకు కారణమైంది. జిల్లాల ప్రకటన చేసిన నాటి నుంచి హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే హిందూపురం వాసులు బంద్ నిర్వహించి ప్రభుత్వ నిర్ణయంపై తమ నిరసన తెలియజేశారు. ఒక యువకుడు కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో హిందూపురం జిల్లా ఉద్యమం రగిలింది.

    Also Read: ఉద్యోగుల్లో చీలిక తెచ్చే దిశగా.. జగన్ సర్కారు ఎత్తుగడలివే..!

    అనంతపురం జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేయబోతున్న ‘సత్యసాయి’ జిల్లాకు జిల్లా కేంద్రంగా పుట్టపర్తిని ప్రకటించడంతో అసంతృప్తి జ్వాల బయటపడింది. దీన్ని హిందూపురం వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అన్ని అర్హతలున్నా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

    ఈ క్రమంలోనే ప్రముఖ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రంగంలోకి దిగారు. స్థానిక ప్రజల డిమాండ్ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పోరుబాట పట్టారు. తాజాగా హిందూపురంనుజిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు. లోక్ సభ నియోజకవర్గమైన హిందూపురానికి జిల్లా కేంద్రానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయని బాలకృష్ణ తేల్చిచెప్పారు.

    Balakrishna Deeksha in Hindupur

    ఈ క్రమంలోనే హిందూపురం జిల్లా కోసం భారీ ర్యాలీ నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అనంతరం మౌనదీక్ష చేపట్టారు. ప్రభుత్వం ప్రకటన చేసిన పుట్టపర్తిని కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని బాలకృష్ణ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పట్టణంలోని పొట్టిశ్రీరాములు కూడలి నుంచి అంబేద్కర్ కూడలి వరకూ టీడీపీ శ్రేణులు, జిల్లా సాధన కోసం మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, మౌన దీక్ష కూర్చునే ముందు హిందూపురం జిల్లా కేంద్రంపై తన స్టాండ్ ను తెలియజేశారు.

    -బాలయ్య సంచలనం.. రాజీనామా సవాల్.. వైసీపీ రెడీనా?

    హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హిందూపురం కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నానని బాలయ్య సంచలన సవాల్ చేశారు. ఉద్యోగుల ఆందోళన నుంచి దృష్టి మళ్లించడం కోసమే ప్రభుత్వం రాత్రికి రాత్రి జిల్లాల ప్రకటన చేసిందని బాలకృష్ణ ఆరోపించారు. అన్ని వసతులు ఉన్న హిందూపురానికి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బాలయ్య డిమాండ్ చేశారు.

    హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే తాను రాజీనామా చేస్తానని బాలయ్య ప్రకటించడం సంచలనమైంది. ఈ మేరకు వైసీపీకి ఆయన ఇచ్చిన సవాల్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారా? అంటూ బాలయ్య సవాల్ చేశారు. హిందూపురం జిల్లా కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని సవాల్ చేశారు. జిల్లా కేంద్రంగా ప్రకటించేవరకూ ఉద్యమాన్ని విరమింపచేసేది లేదని బాలయ్య స్పష్టం చేశారు.

    -డిఫెన్స్ లో వైసీపీ..
    ఎమ్మెల్యే బాలయ్య తాజా ప్రకటన వైసీపీని డిఫెన్స్ లో పడేసింది. జిల్లా కేంద్రంగా హిందూపురం చేయలేదని స్థానిక వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే బాలయ్య వ్యాఖ్యలతో అది మరింత పెరిగింది. బాలకృష్ణకు నియోజకవర్గంలో చెక్ పెట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్న వైసీపీకి ఈ కొత్త జిల్లాల ప్రకటనతో మొత్తం పోయినట్టైంది. వైసీపీ నేతలకు సీన్ రివర్స్ అయ్యింది. బాలయ్య రాజీనామా ప్రకటనతో ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా వైసీపీ నేతలు పరిస్థితి మారింది. బాలయ్య అదును చూసి వైసీపీకి గట్టి షాక్ ఇచ్చాడని నేతలు అంటున్నారు.

    Also Read: అస‌దుద్దీన్ ఓవైసీకి జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌

    Tags