https://oktelugu.com/

Balakrishna: చంద్రబాబు కోసం కదిలిన నందమూరి కుటుంబం, బాలయ్య

Balakrishna: చంద్రబాబుకు మద్దతుగా నందమూరి ఫ్యామిలీ రంగంలోకి దిగింది. అధికార పక్ష నేతలు హద్దులు దాటితే ఊరుకోం అంటూ అగ్రహీరో నందమూరి బాలయ్య సహా నందమూరి కుటుంబ సభ్యులు ఏకమై నిప్పులు చెరిగారు. వైసీపీ హద్దులు దాటితో మాలో ఇంకో అవతారం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారంతో మీరు అడ్డుపెట్టుకున్న గోడలను సైతం బద్దలు కొట్టి మీ భరతం పడుతాం ఖబడ్దార్ అని ఎమ్మెల్యే కం స్టార్ హీరో బాలయ్య హెచ్చరించారు. నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, […]

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2021 / 03:45 PM IST
    Follow us on

    Balakrishna: చంద్రబాబుకు మద్దతుగా నందమూరి ఫ్యామిలీ రంగంలోకి దిగింది. అధికార పక్ష నేతలు హద్దులు దాటితే ఊరుకోం అంటూ అగ్రహీరో నందమూరి బాలయ్య సహా నందమూరి కుటుంబ సభ్యులు ఏకమై నిప్పులు చెరిగారు. వైసీపీ హద్దులు దాటితో మాలో ఇంకో అవతారం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

    Nandamuri-family-Press-meet

    అధికారంతో మీరు అడ్డుపెట్టుకున్న గోడలను సైతం బద్దలు కొట్టి మీ భరతం పడుతాం ఖబడ్దార్ అని ఎమ్మెల్యే కం స్టార్ హీరో బాలయ్య హెచ్చరించారు. నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు కంటతడి పెట్టుకున్న పరిణామాలపై నందమూరి ఫ్యామిలీ కదిలివచ్చింది. ఏకమై ప్రెస్ మీట్ నిర్వహించి మరీ కడిగిపారేశారు.

    ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ‘అసెంబ్లీలో విమర్శలు సహజం.. కానీ రాజకీయాలతో సంబంధం లేని నా సోదరి వ్యక్తిత్వాన్ని కించపరిచేస్తూ అధికార వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సహించరానివి. అధికార పార్టీ నేతల తీరు చూస్తుంటే గొడ్ల చావిట్లో వున్నామా? అనే అనుమానం కలుగుతుంది అని బాలయ్య హెచ్చరించారు.

    Also Read: Actor Karthikeya: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన హీరో కార్తికేయ ఫోటోలు… పెళ్లి కొడుకుగా రెడీ

    ప్రజల తరుఫున నా అభిమానుల తరుఫున నందమూరి ఫ్యామిలీ తరుపున అంటూ బాలయ్య వైసీపీకి హెచ్చరికలు జారీ చేశారు. ఆడవాళ్ల జోలికి వస్తే చేతులు ముడుచుకొని కూర్చోమని హెచ్చరికలు జారీ చేశారు. మళ్లీ ఇలాంటి నీచపు మాటలు మాట్లాడితే సహించేది లేదన్నారు. మీ భరతం పడుతామని.. ఆడవాళ్ల జోలికి వస్తే చేతులు ముడుచుకొని కూర్చోమని స్పష్టం చేశారు. ఇకపై ఎవరు నోరు తెరిచినా సహించమన్నారు. అధికారంతో అడ్డుపెట్టుకున్న గోడలు బద్దలు కొట్టి మీ భరతం పడుతాం.. ఖబడ్దార్ అంటూ బాలకృష్ణ హెచ్చరికలు జారీ చేశారు.

    Also Read: Tollywood: డిసెంబర్ లో వరుస సినిమాలతో పోటీకి సై అంటున్న టాలీవుడ్ హీరోలు…