NBK X PSPK Power Teaser : నందమూరి బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న ‘అన్ స్థాపబుల్ విత్ NBK’ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అతి త్వరలోనే ప్రసారం కానుంది.. ఈ సందర్బంగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫుల్ ప్రోమోని ఈరోజు రాత్రి 8 గంటలకు విడుదల చేసారు.. ఈ ప్రోమో కి అభిమానుల నుండే కాకుండా ప్రేక్షకుల నుండి కూడా అదిరిపోయే స్పందన వచ్చింది.. పవన్ కళ్యాణ్ గురించి మనకెవ్వరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను రాబట్టడానికి బాలయ్య గట్టి ప్రయత్నం చేసినట్టు అనిపించింది.. అదే సమయంలో ఫుల్ ఫన్ గా కూడా ఈ ప్రోమో నడిచింది.. అందులోని కొన్ని హైలైట్స్ ఇప్పుడు మనం చూద్దాం.
ముందుగా బాలయ్య -పవన్ కళ్యాణ్ కలిసి భారీ బిల్డప్ తో స్టేజి పైకి వస్తారు.. ఎన్నడూ లేని విధంగా NBK vs PSPK అంటూ ప్రత్యేకమైన క్రాకర్స్ ని కాలుస్తూ పైకి లేపుతారు.. ఇక ఆ తర్వాత నుండి అసలు సరదా మొదలవుతుంది.. బాలయ్య బాబు చాలా తీవ్రమైన ప్రశ్నలే అడిగినట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ‘ఇప్పుడు మీ అన్నయ్య చిరంజీవి ఉన్నాడు.. ఆయన నుండి నువ్వు తీసుకున్న అంశాలు ఏమిటి.. వదిలేసిన అంశాలు ఏమిటి’ అని అడుగుతాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానం ని మ్యూట్ లో పెట్టగా, ఆ తర్వాత ‘ఇక ఈ సినిమా తర్వాత మా వదినకి ఫోన్ చేసి చెప్పేసాను.. నా వల్ల కాదు ఇదే నా చివరి సినిమా అని ‘ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇంకా ఈ ఎపిసోడ్ లో ఎన్నో విశేషాలు ఉన్నాయి.. అవన్నీ చూడడానికి జనవరి 26 వరకు వేచి చూడాల్సిందే.