Power Crisis: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నెలకొంది. విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో దేవ్యాప్తంగా తీవ్రమైన విద్యుత్ కోతలు ప్రారంభం అయ్యాయి. జెన్ కో ప్లాంట్లకు బొగ్గు దిగుమతి తగ్గడంతో చాలా ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. చాలా ప్లాంట్లు ఉత్పత్తిని నిలిపివేశాయి. ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురవుతుండగా.. ఏపీ సీఎం జగన్ వెంటనే స్పందించారు. విషయాన్ని ప్రధాని మోదీకి వివరిస్తూ.. లేఖరాశారు. ఏపీకి విద్యుత్ అవసరమని, తీవ్రమైన కొరత ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఏర్పడిన బొగ్గు నిల్వల కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తికి విఘాతం ఏర్పడుతోందని… సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని చెబుతుండగా… ఏపీలో మాత్రం కొరతను అధిగమించేందుకు కోతలు ప్రారంభించారు. ప్రతీరోజు ఐదారు గంటలు కోతలు విధిస్తూ.. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.

దేశవ్యాప్తంగా విద్యుత్ కోత తీవ్రంగా ఉంది. దీంతో ఎంత వెచ్చించి కొందామన్నా దొరకడం లేదు. ఏపీలోనూ సమస్య తీవ్రంగా ఉంటుండగా.. కోతలు పెడుతున్నట్లు తెలిపారు. దీంతో జగన్ సర్కారు విద్యుత్ లోటును ఎలా అధిగమించాలనే ఆలోచన చేస్తున్నారు. కోతల ద్వారా డిమాండ్ ను తగ్గించి.. పొదుపుగా విద్యుత్ ను వాడాలని అనుకుంటున్నారు. రాష్ట్రంలో రోజూవారిగా 8500 మెగావాట్ల వరకు విద్యుత్ డిమాండ్ ఉంది. గతనెల 10వేలకు పెరిగింది. ఈ ప్రభావం వ్యవసాయంపై తీవ్రంగా పడింది. విద్యుత్ కోతల కారణంగా వ్యవసాయంపై తీవ్రమైన ప్రభావం పడింది. ఏప్రిల్ మాసంలో పంటలకు విద్యుత్ అందని పరిస్థితి నెలకొంది.
దీంతో ఏపీలో విద్యుత్ కోతలు ప్రారంభించారు. నిత్యం గంటల తరబడి కోతలు విధిస్తున్నారు. ముఖ్యంగా పల్లెల్లో కోతలు విధిస్తూ.. కరెంటును పొదుపు చేస్తున్నారు. వీటీపీఎస్ లోనూ ఒకరోజుకు మాత్రమే బొగ్గు ఉండడంతో పాటు ఆర్టీపీపీలో మూడు రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. కృష్ణపట్నంలో ఐదురోజులకు మాత్రమే సరిపడే బొగ్గు ఉంది. దీంతో ఏపీలో విద్యుత్ కోతలు తప్పనిసరిగా మారాయి. ప్రస్తుతం పరిస్థితి గాడిన పడకుంటే.. పట్టణ ప్రాంతాల్లోనూ విద్యుత్ కోతలు తప్పవనే సర్కారు హెచ్చరిస్తోంది.