https://oktelugu.com/

Mana Ooru Mana Badi Scheme: మన ఊరు.. మన బడి.. ఓ బడా కంపెనీకి..

Mana Ooru Mana Badi Scheme: ఓ కాళేశ్వరం, మిషన్ భగీరథ, సచివాలయం కూల్చివేత, ఐటీ హబ్ లు, హైదరాబాదులో ఫై ఓవర్లు, తాజాగా మన ఊరు మన బడి.. ఇలా తెలంగాణలో ప్రవేశపెట్టే ఏ పథకమైనా, అభివృద్ధి కార్యక్రమమైనా అందులో అనివార్యంగా బడా కంపెనీలు ప్రవేశిస్తూ ఉంటాయి. అప్పటి దాకా కఠినంగా ఉన్న నిబంధనలన్నీ బడా కంపెనీల కోసం సులభతరంగా మారిపోతూ ఉంటాయి. మాట్లాడితే బీజేపీని కార్పొరేట్ ప్రభుత్వం విమర్శించే కేసీఆర్, కేటీఆర్ అండ్ కో […]

Written By: , Updated On : June 29, 2022 / 09:13 AM IST
Follow us on

Mana Ooru Mana Badi Scheme: ఓ కాళేశ్వరం, మిషన్ భగీరథ, సచివాలయం కూల్చివేత, ఐటీ హబ్ లు, హైదరాబాదులో ఫై ఓవర్లు, తాజాగా మన ఊరు మన బడి.. ఇలా తెలంగాణలో ప్రవేశపెట్టే ఏ పథకమైనా, అభివృద్ధి కార్యక్రమమైనా అందులో అనివార్యంగా బడా కంపెనీలు ప్రవేశిస్తూ ఉంటాయి. అప్పటి దాకా కఠినంగా ఉన్న నిబంధనలన్నీ బడా కంపెనీల కోసం సులభతరంగా మారిపోతూ ఉంటాయి. మాట్లాడితే బీజేపీని కార్పొరేట్ ప్రభుత్వం విమర్శించే కేసీఆర్, కేటీఆర్ అండ్ కో బడా కంపెనీలకు చేస్తున్న మేళ్లకు తెలంగాణలో ఏం కొదవలేదు. తాజాగా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన “మన ఊరు మన బడి” పథకాన్ని కూడా ఒక కార్పొరేట్ కంపెనీ కోసమే రూపొందించారనే ఆరోపణలు లేకపోలేదు. వాస్తవానికి మన ఊరు మన బడి పథకం లో భాగంగా పాఠశాలల్లో ఏర్పాటు చేసే సామగ్రిని ఎస్ఎంసీఈ లలో తయారుచేసినవే వాడాలని నిబంధన ఉంది. కానీ పిలిచిన టెండర్లలో ఎస్ఎంసీఈల ఊసే లేకపోవడంతో వారు ఇప్పుడు కేంద్రాన్ని ఆశ్రయించారు. కేంద్రం కూడా కూపి లాగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Mana Ooru Mana Badi Scheme

Mana Ooru Mana Badi Scheme

బడా కంపెనీ గుప్పిట్లోకి

మన ఊరు మన బడి కార్యక్రమం కింద రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం ₹7,289 కోట్ల నిధులను కేటాయించింది. మూడు దశల్లో ఈ పనులను చేపట్టనుంది. ఇందులో భాగంగా 9,123 పాఠశాలను అభివృద్ధి చేయనుంది. పాఠశాల భవనాల మరమ్మతులు, తాగునీరు, తరగతి గదుల నిర్మాణం, గోడ నిర్మాణం, విద్యుత్, గ్రీనరీ వంటి పనులను చేపట్టనున్నది. వీటితో పాటు పాఠశాలలకు అవసరమయ్యే గ్రీన్ చాక్ బోర్డులు, ఫర్నిచర్, డ్యూయల్ డెస్క్ ల ఏర్పాటు, గోడలకు రంగులు వేయడం వంటి పనులు చేపట్టనున్నది. ఈ పనులకు స్థాయిలో టెండర్లను పిలిచింది. వాస్తవానికి నీటిపారుదల, రోడ్ల నిర్మాణం వంటి పెద్ద పెద్ద పనులకు కార్పొరేట్ కంపెనీలను, కాంట్రాక్టు సంస్థలను ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. కానీ ఏమాత్రం సాంకేతికత అవసరం లేని పాఠశాలల పనులను బడా కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.

Also Read: Dissent Leaders In YCP: వైసీపీ నేతల్లోనే అసమ్మతి కుంపట్లా? ఏం జరుగుతోంది?

జీవో 51 కి వక్ర భాష్యం

సాంకేతికత అవసరం పడని పనులను ఎస్ఎంసీఈలకు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో 51 విడుదల చేసింది. దీని ప్రకారం కేవలం ₹10 వేలు చెల్లించి ఎస్ఎంసీఈలు టెండర్లలో పాల్గొనవచ్చు. బ్యాంక్ గ్యారంటీ, అడ్వాన్సుల చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. వీటన్నిటిని కాదని ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టింది. ఉదాహరణకు డ్యూయల్ డెస్క్ ఏర్పాటు పనులకు సంబంధించి ఏప్రిల్ 20న ప్లోట్ టెండర్ డాక్యుమెంట్ లో అంచనా వ్యయాన్ని ₹219 కోట్లుగా ఖరారు చేసింది. ఈ టెండర్ లో పాల్గొనాలంటే టెండర్ విలువలో 25% గా అంటే 54.75 కోట్ల వ్యాపారం చేసి ఉండాలని నిబంధన పెట్టింది. అనంతరం మే 9వ తేదీన టెండర్ అంచనా వ్యయాన్ని ₹360 కోట్లకు పెంచింది. అంతేనా ఇందులో పాల్గొనే కంపెనీకి అర్హత గతంలో నిర్ణయించినట్టు కాకుండా 50 శాతానికి పెంచుతూ అంటే ₹180 కోట్ల వ్యాపారం అనుభవం ఉండాలని నిబంధన తీసుకువచ్చింది. చిన్న కంపెనీలకు ఈ స్థాయిలో వ్యాపార లావాదేవీలు ఉండవు కాబట్టే వాటిని పక్కకు తప్పించేందుకు ప్రభుత్వం ఈ నిబంధన తీసుకువచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి.

Mana Ooru Mana Badi Scheme

Mana Ooru Mana Badi Scheme

అంతా మోసం

రంగులు వేసేందుకు, ఫర్నిచర్ కోసం, డ్యూయల్ డెస్క్ ల కోసం, గ్రీన్ చాక్ బోర్డులకు మొత్తం ₹పదిహేను వందల ముప్పై తొమ్మిది కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులను అడ్డగోలుగా దక్కించుకునేందుకు బడా కంపెనీ రంగంలోకి దిగింది. వీటిల్లో చేపట్టే కొన్ని పనులకు నేరుగా, మరి కొన్ని పనులకు తన అనుబంధ సంస్థల తో కలిపి టెండర్లలో పాల్గొన్నది. తన కంపెనీకి అనుభవం లేని పనులకు జాయింట్ వెంచర్ గా మరికొన్ని కంపెనీలను జత చేసుకొని టెండర్లు వేసింది. పోటీ అనేది లేకపోవడంతో పనులను దక్కించుకుంది. పైగా అంచనా విలువ కంటే ఎక్కువకు టెండర్ వేయడం గమనార్హం.

ప్రభుత్వ పెద్దల మేళ్లు

మన ఊరు మన బడి లో పనులను దక్కించుకున్న సదరు సంస్థకు సర్కారు పెద్దలు భారీ ఎత్తున మేళ్లు చే కూర్చుతున్నారు. సదరు కంపెనీకి టెండర్లు కట్టబెట్టేందుకు “కేంద్రీయ బండార్, నాకాఫ్” వంటి ప్రముఖ సంస్థలను ప్రకటించారు. ఓ బడా కంపెనీకి, ఓ మంత్రి కుమారుడి కంపెనీకి పనులు ఇచ్చేందుకే ఇలా నిబంధనలను మొత్తం పూర్తిగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా ఈ కంపెనీలు టెండర్ డాక్యుమెంట్ లో సరైన ధ్రువపత్రాలు పొందుపరచ కాకపోయినా అధికారులు పర్యవేక్షణ లేకుండానే అనుమతించారని ఫిర్యాదులు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏమీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

అంతా మాయ

పాఠశాల గోడలకు రంగులు వేసేందుకు అర్హతగా 131.50 లక్షల చదరపు మీటర్ల పనిని ప్రభుత్వంలో చేసి ఉండాలని నిబంధన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఈ నిబంధన ప్రకారం దేశంలోనే టాప్ _15 కంపెనీల్లో ఒక్క ఏషియన్ పెయింట్స్ కు మాత్రమే ఈ అనుభవం ఉంది. దీంతో ఈ కంపెనీని జాయింట్ వెంచర్ కింద పెట్టుకొని సదరు బడా కంపెనీ పనులు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఇక గ్రీన్ చాక్ బోర్డులో దేశంలో ఉన్న ఏకైక డీలర్ను కాదని ఎక్కువ లాభం పొందేందుకు “వైట్ మార్క్” సంస్థతో జాయింట్ వెంచర్ కుదుర్చుకున్నది. ఇక డ్యూయల్ డెస్క్ ఫర్నిచర్ సరఫరా విషయంలో ఎలిగెంట్-గోద్రెజ్ కంపెనీ టెండర్ వేసింది. కానీ గోద్రెజ్ కంపెనీకి మ్యానుఫ్యాక్చర్ వింగ్ లేదు. అయితే బోగస్పత్రాలతో ఎలిగెంట్ సంస్థ టెండర్లను దక్కించుకునే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.

Mana Ooru Mana Badi Scheme

KCR

గణేష్ ఉయ్యూరి ఫిర్యాదు

మన ఊరు మన బడి టెండర్ల వ్యవహారంలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలంటూ గణేష్ ఉయ్యూరి అనే సామాజిక కార్యకర్త లోకయుక్తకు, సీబీఐకి ఫిర్యాదు చేశారు. బడా కంపెనీకి ఈ పనులు అప్పగించేందుకు వీలుగా నిబంధనలు మార్చారని ఆయన ఆ ఫిర్యాదులో వివరించారు. అంచనా కంటే ఎక్కువ మొత్తంలో టెండర్లను ఖరారు చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని, దీనిని అడ్డుకోవాలని ఆయన కోరారు. ఇటీవల కేంద్రం కూడా మన ఊరు మన బడి పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో దీనిపైన ఏం చర్యలు తీసుకుంటుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: Cabinet Reshuffle in Telangana: మంత్రివర్గ మార్పునకు లైన్‌ క్లియర్‌.. రాజ్‌భవన్‌లో ఎంట్రీ అందుకేనా?

Tags