BJP vs KCR: రాష్ట్రంలో పాలన గాడి తప్పుతోందా? కంచే చేను మేస్తోందా? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారే అమాయకులను భక్షిస్తారా? న్యాయం చేయకపోగా అక్రమ కేసులు బనాయిస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. ప్రజా సంక్షేమం పట్టు తప్పుతోంది. సంక్షేమం మాట దేవుడెరుగు. ప్రజలకు రక్షణ కరువవుతోంది. పాలకులే ప్రజల పాలిట రాక్షసుల్లాగా మారుతున్నారు. ఫలితంగా శాంతిభద్రతలు డొల్ల అవుతున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున అయిదు రోజుల క్రితం ఓ బాలికపై అత్యాచారం జరిగితే ఇంతవరకు నిందితులను గుర్తించలేదు. వారిని అరెస్టు చేయలేదు. వారిని శిక్షించేందుకు కూడా ముందుకు రావడం లేదు.

దీనిపై బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ మండిపడుతున్నారు. బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెబుతున్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలేదని లేదని చెబుతున్నారు. నిన్న వరంగల్ జిల్లా ఘటన మరవక ముందే మరోమారు సర్కారు మరో అప్రదిష్ట మూటగట్టుకుంది. దీంతో టీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయనే తెలుస్తోంది. అందుకే వరుస సంఘటనలతో ప్రతిష్ట కోల్పోతోంది. రోజురోజుకు మచ్చ తెచ్చుకుంటోంది. ప్రజల్లో చులకన అవుతోంది. ప్రజాస్వామ్యంలో పాలన ఇంత దారుణంగా ఉంటుందా. ప్రజలను రక్షించే పోలీసులే ప్రభుత్వానికి కొమ్ము కాస్తే ఇంకేముంది? సర్వం అవినీతి మయమే. అంతా బంధుప్రీతి కోసమే.
Also Read: Janasena: తెలంగాణలో బాలికపై గ్యాంగ్ రేప్: పోరుబాటులోకి జనసేన..
టీఆర్ఎస్ ది స్వచ్ఛమైన పాలన అని చంకలు గుద్దుకునే టీఆర్ఎస్ దీనికి ఏం సమాదానం చెబుతుంది. బాలికను తీసుకెళ్లే కారులో టీఆర్ఎస్, ఎంఐఎం లీడర్లు ఉన్నట్లు సీసీ పుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వానికి పోలీసులు వత్తాసు పలకడం ఏమిటి? వారిని రక్షించేందుకు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడం ఏమిటనే ప్రశ్నలు బండి సంజయ్ అడుగుతున్నారు అధికార పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి. ఇక రాబోయే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తాం అని జోస్యం చెబుతున్నారు.

జూబ్లీహిల్స్ లో బాలికపై అఘాయిత్యం జరిగి ఐదు రోజులైనా పోలీసులు ఏం చేస్తున్నారు? చట్టాన్ని రక్షిస్తున్నారా? లేక పాలకులను కాపాడుతున్నారా? రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలకు కళ్లెం వేస్తామని చెబుతున్నారు. ఆడవారికి రక్షణ కల్పించని ప్రభుత్వం ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతటి దుర్మార్గమైన చర్యలకు దిగుతూ వారి పాలిట దెయ్యంలా మారుతోంది. ప్రజలను కాపాడాల్సిన వారే వారిని ముప్పతిప్పలు పెట్టడంతో ఇక వారు ఎవరికి చెప్పుకోవాలి.
టీఆర్ఎస్ ఎంఐఎం మోచేతి నీళ్లు తాగుతూ దానికి మద్దతు ఇస్తోంది. బీజేపీని మతతత్వ పార్టీ అని చెబుతూ ఎంఐఎంను మాత్రం అక్కున చేర్చుకోవడంలో ఆంతర్యమేమిటి? ఎంఐఎం మతతత్వ పార్టీ కాదా? అదేమన్నా లౌకిక పార్టీనా? అని సంజయ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దురాగాతాలకు బారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. టీఆర్ఎస్ తప్పులే బీజేపీకి ప్లస్ గా మారుతున్నాయి. ఇన్ని దురంతాలు వెలుగు చూడటంతో ఇక టీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమే కానుంది. దీంతో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భంగపాటు తప్పదు. ఎందరు పీకేలు వచ్చినా టీఆర్ఎస్ పతనం ఖాయమనే అభిప్రాయాలు అందరిలో వస్తున్నాయి. ఇక టీఆర్ఎస్ రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే మరి.
Also Read:Star Heroine: తమిళ తెరపై వెలిగిపోతున్న అచ్చ తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
[…] Also Read: BJP vs KCR: కేసీఆర్ కు బ్యాడ్ టైం.. బీజేపీకి వ… […]