https://oktelugu.com/

ట్రంప్ కు వెన్నుపోటు: వాషింగ్టన్ రక్తసిక్తం.. మారణాయుధాలతో స్వైరవిహారం

అమెరికా అట్టుడుకుతోంది. ట్రంప్ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య దాడులు, ప్రతిదాడులతో రక్తసిక్తమవుతోంది. అమెరికా దేశ రాజధాని వాషింగ్టన్‌లో చీకటి పడుతున్న కొద్దీ.. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిపోయాయి. ఈ ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడం నేషనల్ గార్డులను తరలించాల్సి వచ్చింది. మారణాయుధాలతో దాడులకు దిగడంతో ఇద్దరికి కత్తిపోట్లు అయ్యాయి. ఈ ఘర్షణల్లో కొందరు పోలీసులు గాయపడ్డారు.వామపక్ష వారిని అదుపుచేయడానికి.. ట్రంప్ మద్దతుదారులను రక్షించడానికి పోలీసులు […]

Written By: NARESH, Updated On : November 15, 2020 12:00 pm
Follow us on

Donald Trump Supporters

అమెరికా అట్టుడుకుతోంది. ట్రంప్ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య దాడులు, ప్రతిదాడులతో రక్తసిక్తమవుతోంది. అమెరికా దేశ రాజధాని వాషింగ్టన్‌లో చీకటి పడుతున్న కొద్దీ.. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిపోయాయి. ఈ ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడం నేషనల్ గార్డులను తరలించాల్సి వచ్చింది. మారణాయుధాలతో దాడులకు దిగడంతో ఇద్దరికి కత్తిపోట్లు అయ్యాయి. ఈ ఘర్షణల్లో కొందరు పోలీసులు గాయపడ్డారు.వామపక్ష వారిని అదుపుచేయడానికి.. ట్రంప్ మద్దతుదారులను రక్షించడానికి పోలీసులు ప్రయత్నించారు. హింసాత్మక దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read: టీ అమ్మిన వ్యక్తి.. మోడీపై ఒబామా ప్రశంసల జల్లు

వాషింగ్టన్ డీసీలో తాజాగా ట్రంప్ మద్దతుదారులు వర్సెస్ వామపక్ష కార్యకర్తలు దాడులు, ప్రతిదాడులతో రెచ్చిపోయారు. తాజాగా ట్రంప్ కు మద్దతుగా చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారిపోయింది. దాడులు, ప్రతిదాడులు, అరెస్టులతో అల్లకల్లోలంగా మారింది.

ట్రంప్ మరో నాలుగేళ్లు ప్రెసిడెంట్ కావాలని.. మోసపూరిత పథకాలతో ఎన్నికల్లో ట్రంప్ ను ఓడించారని వేలాదిమంది ఆయన మద్దతుదారులు శనివారం దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో ర్యాలీ తీశారు. కానీ వామపక్ష కార్యకర్తలు వైట్ హౌస్ కు దగ్గర్లో ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. ట్రంప్ మద్దతుదారులు అక్కడికి రావడంతో హింసాత్మక వాతావరణం ఏర్పడింది.

Also Read: ఫరూక్ అబ్దుల్లా.. నువ్వు అసలు భారతీయుడివేనా?

అమెరికన్లే ఫస్ట్ అన్న డొనాల్డ్ ట్రంప్ ఓటమిని అక్కడి వామపక్ష కార్యకర్తలు స్వాగతిస్తుండగా.. రిపబ్లికన్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. పరస్పరం విధ్వంసాలకు దిగుతున్నారు. గెలుపు సంబరాలు చేసుకుంటున్న డెమొక్రాట్లపై దాడులకు దిగుతున్నారు.  వామపక్ష కార్యకర్తలు ట్రంప్ మద్దతుదారులను వెంబడించారు. ఒక డౌన్ టౌన్ హోటల్ ను ముట్టడించారు. పోలీసులు వారిని నిలువరించేందుకు కష్టపడ్డారు. చివరకు పెప్పర్ స్ర్పేను ఉపయోగించి బలవంతంగా జనాన్ని అక్కడి నుంచి చెదరగొట్టారు.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు