Ambati Ayyanna Twitter War: ఏపీలో ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య ట్విట్టర్ యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత వ్యాఖ్యానాలు చేసుకుంటూ కాక రేపుతున్నారు. ప్రధానంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన ట్విట్ పై పెద్ద దుమారమే రేగుతోంది. రెండు రోజుల కిందట ఆయన చేసిన ట్విట్ చేశారు. ఏపీ కేబినెట్ లో ఒకరు మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించారని.. అందుకు తగ్గ సాక్షాలు చేరవలసిన చోటుకు చేరాయని.. త్వరలో ఆయన మంత్రి పదవి ఊడడం ఖాయమని ఆ ట్విట్ సారాంశం. మంత్రి పేరు అయితే వెల్లడించలేదు కానీ.. ‘కాంబాబు’ అంటూ సంభోదించారు. అయితే దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించి ట్విట్ చేశారు. తెలుగుదేశం పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ ట్విట్ ను అయ్యన్నపాత్రుడికి ట్యాగ్ చేశారు. అయితే దీనిపై నెటిజెన్లు మంత్రి అంబటిపై వీర లెవల్ లో కామెంట్లు చేశారు. పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారెందుకని ప్రశ్నించారు. అంటే మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించినట్టు మంత్రి ఒప్పుకున్నట్టేనని సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే మంత్రి అంబటి అయ్యన్నపాత్రుడిల మధ్య ట్విట్టర్ యుద్ధం నడుస్తోంది. మల్లెపూల అంబటికి నీటి పారుదల శాఖ కేటాయించారు. ఆయనేమి పోలవరం కడతాడు అంటూ అయ్యన్న వ్యాఖ్యానించగా.. ఇంట్లో పనికి వచ్చిన పనిమనిషిని, పాఠాలు చెప్పడానికి వచ్చిన టీచర్ ను లైంగికంగా వేధించింది ఎవరో తెలుసునని అంబటి తన ట్విట్ లో వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుతం అంబటి చుట్టూ మాత్రం ఆరోపణలు పెరుగుతున్నాయి. గతంలో కూడా ఆ మంత్రిపై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. మహిళలతో అసభ్యంగా మాట్లాడినట్లు కొన్ని ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. అవి తనవి కావంటూ ఆయన వాటిని ఖండించారు. మార్ఫింగ్ చేసి వాటిన విడుదల చేశారని, నేరస్తులను పట్టుకొని శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ఆయన మంత్రిగా లేరు.
విపక్షాలకు అస్త్రంగా..
ప్రస్తుతం మంత్రి అంబటి వ్యవహార శైలి టీడీపీకి ప్రచార ఆస్త్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యాచారాలు ఎక్కువవడంతోపాటు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోందని తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి, రేపల్లె బస్టాండ్ సంఘటనలు మరువకముందే ఏకంగా ఒక మంత్రిపై ఆరోపణలు రావడంతో ప్రజలు విస్తుపోతున్నారు. దీంట్లోని నిజనిజాలను వెలికితీయాలని కోరుతున్నారు. సదరు మంత్రిని పదవినుంచి దింపేవరకు పోరాటం చేస్తామని తెలుగుదేశం, జనసేన వర్గాలు ప్రకటించాయి. పోరాటానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాయి. మరోవైపు వైసీపీ నేతలు గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం పేరిట ప్రజల మధ్యకు వెళుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్ష టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం చేపడుతోంది. ఇటువంటి సమయంలో మంత్రిపై లైంగిక అభియోగాలు రావడం అధికార పార్టీకి మైనస్ గా మారింది. అయితే అంబటి కంగారు వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు వైసీపీ నేతల్లో సైతం ఉన్నాయి. అంబటి పార్టీకి మైనస్ చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఈ లైంగిక ఆరోపణల నుంచి అంబటి ఎలా బయటపడతారో చూడాలి మరీ.
Also Read: KCR Politics: ఇంత తిడుతున్నా కేసీఆర్ మౌనానికి కారణమేంటి..?
Recommended Videos: