Avoid Sharing Aadhaar: ఆధార్ కార్డును ఎవరికి పడితే వారికి ఇస్తే ప్రమాదమే. ఆధార్ కార్డును చాలా సంస్థలు దుర్వినియోగం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అధార్ కార్డుదారులకు కొన్ని సూచనలు చేసింది. అదే సమయంలో యూజర్ లైసెన్స్ పొందిన సంస్థలు మాత్రమే వ్యక్తిని గుర్తించేందుకు ఆధార్ ఉపయోగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన జారీచేసింది. కేవలం ఆధార్ కార్డుల మాస్క్‌డ్ కాపీస్‌ను మాత్రమే షేర్ చేయాలని సూచించింది.

ఆధార్ సంఖ్యలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే విధంగా జెరాక్స్ కాపీ తీసి ఇతరులకు ఇవ్వాలని తెలిపింది. ఇతరుల ఆధార్ కార్డుల కాపీలను సేకరించి, తమ వద్ద ఉంచుకునేందుకు హోటళ్ళు, సినిమా హాళ్ళు వంటి లైసెన్స్ లేని సంస్థలకు అనుమతి లేదని తెలిపింది. భారత దేశ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ నుంచి యూజర్ లైసెన్స్ పొందిన సంస్థలు మాత్రమే వ్యక్తిని గుర్తించేందుకు ఆధార్‌ను ఉపయోగించవచ్చునని తెలిపింది. ప్రజలు తమ ఆధార్ కార్డు కాపీని ఇచ్చే ముందు సంబంధిత సంస్థకు ఇటువంటి యూజర్ లైసెన్స్ ఉన్నట్లు ధ్రువీకరించుకోవాలని చెప్పింది. ఆధార్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రజలు పబ్లిక్ కంప్యూటర్లను ఉపయోగించుకోవద్దని తెలిపింది. ఇంటర్నెట్ కేఫ్‌ల వంటి వాటిలోని కంప్యూటర్ల నుంచి ఆధార్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవద్దని తెలిపింది. ఒకవేళ ఇటువంటి కంప్యూటర్లను ఉపయోగించినట్లయితే, ఆ ఈ-ఆధార్ కాపీలను ఆ కంప్యూటర్ల నుంచి శాశ్వతంగా డిలీట్ చేసినట్లు ధ్రువీకరించుకోవాలని పేర్కొంది.
Also Read: F3 – 2 Day Collections: ‘ఎఫ్ 3’ 2nd డే బాక్సాఫీస్ కలెక్షన్స్
‘నా ఆధార్ నా గుర్తింపు’ పేరిట అందించిన కార్డు ఇప్పుడు చాలావరకూ దుర్వినియోగమవుతోంది. అటు సంఘ విద్రోహ శక్తులు సైతం నకిలీ ఆధార్ ను వినియోగిస్తున్నట్టు కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి. అదే సమయంలో స్వదేశంలో సైతం ఆధార్ పేరిట రకరకాల మోసాలు వెలుగుచూస్తున్నాయి. సంక్షేమ పథకాల మాటున ఆధార్ మార్ఫింగ్ కు సైతం పాల్పడుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇదో ప్రాధాన్యతాంశంగా తీసుకొని దేశ ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీచేసింది. ‘‘మీ ఆధార్ జెరాక్స్ కాపీని ఏ సంస్థకూ ఇవ్వకండి, ఎందుకంటే, అది దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయంగా మీరు మీ ఆధార్ సంఖ్యలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేవిధంగా మాస్క్‌డ్ ఆధార్‌ను మాత్రమే ఇవ్వండి’’ అని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రకటన విడుదల చేసిందంటే దీనిని అర్ధం చేసుకోవచ్చు. అయితే చాలా మంది మాస్క్ డ్ ఆధార్ కాపీలు ఎలా పొందాలి? అన్నదానిపై స్పష్టత లేదు. అందుకే దీనిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని భావిస్తోంది.

మాస్క్‌డ్ కాపీ ఇలా పొందవచ్చు..
– Official UIDAI website నుంచి మాస్క్‌డ్ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
– మీ 12 అంకెల ఆధార్ కార్డు సంఖ్యను ఈ వెబ్‌సైట్‌లో ఎంటర్ చేయాలి.
– ‘Do you want a masked Aadhaar’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
– మాస్క్‌డ్ ఆధార్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Also Read:NTR Anna Canteen: ఏపీలో తెరుచుకుంటున్న అన్న క్యాంటీన్లు