AP New Ministers: సీఎం జగన్మోహన్ రెడ్డి రెండోసారి తన క్యాబినేట్ విస్తరించాలని గతంలో నిర్ణయించారు. ఈమేరకు నేడు ఉదయం 11.:30గంటల గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులతో గవర్నర్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో అమరావతిలో కొద్దిసేపటి క్రితమే అట్టహసంగా మొదలైంది.
CM Jagan Surprise
ఏపీ కొత్త క్యాబినేట్ ప్రమాణ స్వీకారానికి సుమారు 5వేల మంది ప్రజాప్రతినిధులు హాజరైనట్లు తెలుస్తోంది. వేదికపై సీఎం జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వ భూషణ్ హరిప్రసాద్ ఉండగా ప్రజాప్రతినిధులంతా తమతమ సీట్లలో కూర్చొని ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా సత్తనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తర్వాత కడప నుంచి అంజాద్ పాషా, ఎర్రగొండపాలెం నుంచి ఆదిమూలపు సురేష్, చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, మాడుగుల నుంచి బూడి ముత్యాల నాయుడులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం డోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రామచంద్రాపురం నుంచి వేణుగోపాలకృష్ణ, తుని నుంచి దాడిశెట్టి రాజా, శ్రీకాకుళం నుంచి ధర్మనా ప్రసాదరావు, అనకాలపల్లి నుంచి గుడివాడ అమర్ నాథ్ లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తర్వాతి క్రమంలో ఆలూరు నుంచి గుమ్మనూరు జయరాం, పెడన నుంచి జోగి రమేష్, సర్వేపల్లి నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి, తణుకు నుంచి కారుమూరి నాగేశ్వర్ రావు, తాడేపల్లిగూడెం నుంచి కొట్టు సత్యనారాయణ, గంగాధ నెల్లూరు నుంచి నారాయణ స్వామిలు ప్రమాణ స్వీకారం చేశారు.
కల్యాణదుర్గం నుంచి ఉషశ్రీచరణ్, వేమూరు నుంచి మేరుగు నాగార్జున, పుంగనుంచి నుంచి పెద్దిరెడ్డి రాంద్రారెడ్డి, అమలాపురం నుంచి పినిపె విశ్వరూప్, నగరి నుంచి ఎమ్మెల్యే రోజా, చిలకూరిపేట నుంచి విడతల రజిని, మిగతా మంత్రులంతా వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరికీ ఈ సాయంత్రంలోగా సీఎం జగన్మోహన్ రెడ్డి శాఖలను కేటాయించే అవకాశం ఉంది.