Virat Kohli: ప్రస్తుతం టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లి భవితవ్యం చర్చ జరుగుతోంది. ఎందుకు అతడు ఫిట్ నెస్ గా ఉండటం లేదు. తన బ్యాట్ తో ఎందుకు పరుగులు చేయడం లేదు. గతంలో చూపిన ప్రతిభ ఇప్పుడు ఎందుకు చూపించడం లేదు. విమర్శలకు ఎందుకు గురవుతున్నాడు. గత రెండేళ్లుగా కనీసం ఒక సెంచరీ కూడా చేయకపోవడంపై సందేహాలు వస్తున్నాయి. కెప్టెన్ గా ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న కోహ్లి ప్రస్తుతం ఎందుకు ఆ స్థాయిలో ప్రదర్శన చేయడం లేదు. దీంతో సెలెక్టర్ల దృష్టి కూడా కోహ్లిపై పడటం లేదు. విరాట్ ఒంటరితనంగా ఫీలవడంతోనే రాణించలేకపోతున్నానని చెబుతున్నాడు. తన ఒంటరితనమే శాపంగా మారుతోందని తెలుస్తోంది.

ఇంగ్లండ్, వెస్టిండీస్ పర్యటనలో కూడా కోహ్లి తన బ్యాట్ కు పని చెప్పకపోవడం విడ్డూరం. ఒత్తిడి, మానసిక సమస్యలు తదితర ఇబ్బందుల దృష్ట్యా అతడు తన బ్యాట్ ఝళిపించలేదని తెలుస్తోంది. ఆటగాడికి సొంత సమస్యలు ఏమి ఉన్నా ఆటలో మాత్రం వాటిని విడిచిపెట్టి జట్టుతో మమేకమై తన అద్భుత ప్రదర్శన చూపించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే విరాట్ తనకున్న సమస్యల వల్లే ఆటలో ప్రావీణ్యం చూపించడం లేదనే విమర్శలు సైతం వస్తున్నాయి. శారీరక, మానసిక ఒత్తిడులను దూరం చేసుకుని ఆటపై దృష్టి పెడితేనే ప్రయోజనం కలుగుతుంది.
ఫిట్ నెస్ లేకపోవడంతోనే రాణించడం లేదని తెలుస్తోంది. అందుకే ప్రతి మ్యాచ్ లో కూడా పరుగులు చేయడం లేదు. దీంతో అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సహజంగా భోజన ప్రియుడైనా మితంగా ఆహారం తీసుకుంటున్నా ఆటలో మాత్రం తన సత్తా చాటడం లేదు. ఫలితంగా అందరి నుంచి విమర్శలే ఎదుర్కొంటూ తన కెరీర్ ను ప్రశ్నార్థకంలో పడేసుకుంటున్నాడు. అభిమానుల అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ప్రారంభంలో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నా తరువాత కాలంలో ఆ స్థాయి ఆట చూపించలేక సతమతమవుతున్నాడు.

ఆసియా కప్ లో సత్తా చాటకపోతే అతడి కెరీర్ డైలమాలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా మ్యాచుల్లో సత్తా చాటకున్నా జట్టులోకి తీసుకుంటున్నా అతడు మాత్రం తన ఆటతీరు మార్చుకోలేదు. దీంతో సహజంగానే అందరి నుంచి విమర్శలే వచ్చాయి. అయినా అతడి పర్ఫార్మెన్స్ మాత్రం మారలేదు. ఫిట్ నెస్ గా ఉన్నా ఎందుకో తన ప్రదర్శన మాత్రం మెరుగుపడటం లేదు. ఇప్పుడు ఆసియా కప్ లో సత్తా చాటకపోతే ఇక అంతే సంగతి అందరు హెచ్చరిస్తున్నారు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లో విరాట్ సత్తా చాటి పరుగులు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. వారి కోరిక తీరుతుందో లేదో వేచి చూడాల్సిందే.
Also Read: Anasuya Bharadwaj: ఇండస్ట్రీలో గిల్లితే గిల్లించుకోవాలట.. బాంబు పేల్చిన అనసూయ