https://oktelugu.com/

Astrologer : మంత్రాలతో అనిల్ అంబానీ అప్పులు తీరుస్తావా? వాహ్ అన్నా వాహ్.. వీడియో

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. "తండ్రి ఆత్మ కొడుకును వెంటాడటం ఏంటి? ఆత్మ వెంటాడితే నష్టాలు వస్తాయా? అనిల్ అంబాని కష్టాలు తీర్చేంత సత్తా ఉన్నవాడివి.. ముందు నీ బతుకును ఎందుకు బాగు చేసుకోలేకపోయావు? సోషల్ మీడియా వాడకం పెరిగినాకొద్ది ఇలాంటి చెత్తను రోజూ చూడాల్సి వస్తోందని" నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 30, 2024 / 07:58 AM IST

    Anil Ambani Debts, Astrologer

    Follow us on

    Anil Ambani – Astrologer : ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరూ అన్నదమ్ములు.. చెరి సమానంగా ఆస్తులు పంచుకున్నారు. ఒకానొక దశలో ఇద్దరూ వ్యాపారంలో పోటీపడ్డారు. అప్పట్లో అనిల్ ఆసియాలోనే అతిపెద్ద ఎనిమిదవ ధనవంతుడిగా రికార్డు సృష్టించారు. అలానే పరిస్థితులు అతనికి అనుకూలంగా ఉంటే ఈ సమయానికి ముఖేష్ అంబానీ మించిపోయేవాడు. కానీ కర్మ ఫలం అతడికి అనుకూలంగా లేదు. ఫలితంగా నష్టాలు, కష్టాలు, అప్పులు.. దీంతో అనిల్ అంబానీ క్రమంగా తగ్గిపోయాడు. అన్న ముఖేష్ అంబానీ చేయూత ఇచ్చినప్పటికీ కోలుకోలేకపోయాడు. ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కూడా లేవు. కోర్టులు, అప్పులు, దివాళా.. ఇలా ఎటుచూసుకున్నా అనిల్ అంబానికి పరిస్థితులు సహకరించడం లేదు. కష్టకాలంలో ఉన్న అనిల్ అంబానీ కి అండగా ఉంటానని ఓ వ్యక్తి వచ్చాడు. నెల రోజుల్లో అతని కష్టాలు మొత్తం తీరుస్తానని, అప్పుల భారం నుంచి బయటపడేస్తానని ఘంటా పథంగా చెప్పాడు. ఇంతకీ ఎవరతను? పేరు మోసిన బ్యాంకరా? ముఖేష్ అంబానికి మించిన ధనవంతుడా?

    సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత పుట్టగొడుగుల్లాగా యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొచ్చాయి. వ్యూయర్షిప్ కోసం అవి ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నాయి. జ్యోతిష్యం పేరుతో తెరపైకి కొత్త కొత్త వ్యక్తులను తీసుకొస్తున్నాయి. వారితో ఇంటర్వ్యూలు (పెయిడ్ ప్రోగ్రామ్స్) చేస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజమో? ఎంతవరకు అబద్ధమో? తెలియదు గాని.. సోషల్ మీడియాలో అలాంటి వారి సందడి రోజురోజుకు పెరిగిపోతుంది. ఆ జ్యోతిష్యులు చెప్పినవన్ని నిజాలని నమ్మేవారు లేకపోలేదు.. అందుకే కదా ఇటీవల ఓ జ్యోతిష్యుడిని రాజకీయ నాయకుల నుంచి సెలబ్రెటీల వరకు నమ్మేది..

    ఇక యూట్యూబ్ ఛానల్ లో ఓ జ్యోతిష్యుడు ఇటీవల అంబానీ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై తనదైన ముత్యాల థియరీ ని బయటపెట్టాడు. ఒక కర్చీఫ్, ధీరు భాయ్ అంబానీ, అనిల్ అంబానీ, ముకేశ్ అంబానీ ఫోటోలను ప్రదర్శించి.. రెండు ప్లాస్టిక్ గన్స్ తో.. ఏవేవో ట్రిక్స్ ప్లే చేశాడు.. ధీరుబాయ్ అంబానీ ఆత్మ అనిల్ అంబానీ ని వెంటాడుతోందని, అది వెంటాడుతున్నన్ని రోజులు అనిల్ అంబానికి ఈ కష్టాలు తప్పవని, నెల రోజుల్లో అనిల్ అంబానీ అప్పులు తీర్చుతానని ప్రకటించాడు. అంతేకాదు తనను నమ్మి అనిల్ అంబానీ తీసుకెళ్తే అతనికి అంతా శుభమే జరుగుతుందని ప్రకటించాడు.

    ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. “తండ్రి ఆత్మ కొడుకును వెంటాడటం ఏంటి? ఆత్మ వెంటాడితే నష్టాలు వస్తాయా? అనిల్ అంబాని కష్టాలు తీర్చేంత సత్తా ఉన్నవాడివి.. ముందు నీ బతుకును ఎందుకు బాగు చేసుకోలేకపోయావు? సోషల్ మీడియా వాడకం పెరిగినాకొద్ది ఇలాంటి చెత్తను రోజూ చూడాల్సి వస్తోందని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.