Minister Kishan Reddy: గోవాలో గెలుపు వెనుక మన తెలుగు నేత

Minister Kishan Reddy: దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేసింది. దీంతో గతంలోలాగా గోవాలో కష్టాలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అక్కడికి కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డిని ఎన్నికల సహ ఇన్ చార్జిగా నియమించింది. దీంతో ఆయన తన చాతుర్యంతో వ్యవహారాలు చక్కదిద్దారు అర్హులకు టికెట్లు కేటాయించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అసంతృప్తులను బుజ్జగించారు. మొత్తానికి గోవాలో బీజేపీ ప్రభంజనం సృష్టించడంలో కిషన్ రెడ్డి పాత్ర ఎంతో ఉందని తెలుస్తోంది. […]

Written By: Srinivas, Updated On : March 11, 2022 2:56 pm
Follow us on

Minister Kishan Reddy: దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేసింది. దీంతో గతంలోలాగా గోవాలో కష్టాలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అక్కడికి కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డిని ఎన్నికల సహ ఇన్ చార్జిగా నియమించింది. దీంతో ఆయన తన చాతుర్యంతో వ్యవహారాలు చక్కదిద్దారు అర్హులకు టికెట్లు కేటాయించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అసంతృప్తులను బుజ్జగించారు. మొత్తానికి గోవాలో బీజేపీ ప్రభంజనం సృష్టించడంలో కిషన్ రెడ్డి పాత్ర ఎంతో ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోమారు గోవాలో సందిగ్ద పరిస్థితులు రాకుండా స్పష్టమైన మెజార్టీ వచ్చేందుకు శాయిశక్తులా కృషి చేశారు.

Minister Kishan Reddy

గోవా దేశంలోనే పెద్ద టూరిజం ప్రాంతం కావడంతో ఇక్కడ అధికారం కోసం బీజేపీ ప్రయత్నాలు చేసింది. బీజేపీ వ్యూహాలు, చేపడుతున్న పథకాలు ప్రజల్లోకి చేరడంలో కీలక పాత్ర పోషించిన కిషన్ రెడ్డి గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డారు. క్రైస్తవ కార్యకర్తలను గుర్తించి వారికి టికెట్లు కేటాయించడానికి తన వంతు ప్రయత్నాలు చేశారు. పార్టీ గెలుపుకు వ్యూహరచన చేశారు. బీజేపీలో మంచి వాతావరణం నెలకొనేందుకు ఆయన చేసిన వ్యూహాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఫలితంగా రాష్ట్రంలో బీజేపీ పాగా వేసింది.

Also Read:  ఐదు రాష్ట్రాల ఫ‌లితాల‌పై కేసీఆర్ మౌనం.. అస‌లు కార‌ణం ఇదే

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో ప్రతిపక్షాలు సైలెంట్ అయిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఎక్కడో పాతాళంలోకి పడిపోయింది. భవిష్యత్ లో కూడా కోలుకునే స్థితిలో కనిపించడం లేదు. దీంతో దేశంలో ఇక కాంగ్రెస్ కు ముచ్చటగా ఒకే రాష్ర్టం చేతిలో ఉండటం గమనార్హం. బీజేపీ మాత్రం అప్రతిహ విజయ యాత్రను కొనసాగిస్తోంది. రాష్ర్టంలో ఉన్న విభేదాలను సమసిపోయేలా చేసి సహృద్భావ వాతావరణం నెలకొల్పేందుకు కిషన్ రెడ్డి పాటుపడినట్లు తెలుస్తోంది.

kishan reddy

తరువాత వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ కిషన్ రెడ్డిని ఇన్ చార్జిగా నియమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తెలంగాణలో కూడా పార్టీ మంచి స్థాయిలో ఉండటం తెలిసిందే. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకొచ్చేందుకు నేతలు ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా టీఆర్ఎస్ ను మట్టికరిపించి కాషాయ జెండా ఎగిరేలా చేయాలని బీజేపీ భావిస్తోంది.

Also Read:  త‌ర్వాత టార్గెట్ ఆ రెండు రాష్ట్ర‌లే.. మోడీ వ్యూహం మొద‌లెట్టేశారు

Tags